Trade Setup For April 3: షేర్ మార్కెట్ ఇవాళ్టి ట్రేడ్ సెటప్..
ABN , Publish Date - Apr 03 , 2025 | 08:47 AM
ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయన్నది అత్యంత ఆసక్తికరం. ఒక పక్క ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి రావడం, దీనికి తోడు ఇవాళ నిఫ్టీ ఎక్స్‌పయిరీ ఉండటం..

నేడు (గురువారం) నిఫ్టీ ఎక్స్‌పయరీ ఉన్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల ఆటుపోట్లు ఇవాళ ఏవిధంగా ఉంటాయన్నది ఆసక్తికర అంశం. మరో పక్క అమెరికా అధ్యక్షుడు తెచ్చిన కొత్త టారిఫ్‌ల మోత మార్కెట్స్ మీద ఉండనుంది. అయితే, నేటి ట్రేడ్ సెటప్ గురించి మార్కెట్ నిఫుణులు చెబుతున్న దాని ప్రకారం నిఫ్టీ 23,400 దగ్గర ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక, నిఫ్టీ 23,400 పైన కొనసాగితే, ర్యాలీ 23,600–23,800 వైపు కూడా వెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు.
బ్యాంక్ నిఫ్టీకి 51,500 – 52,000 ప్రాంతంలో కీలకమైన రెసిస్టెన్స్ ఎదురు కావచ్చని చెబుతున్నారు. ఇక, బలమైన పుట్ రైటింగ్, మార్కెట్ సెంటిమెంట్ దృష్ట్యా బ్యాంక్ నిఫ్టీ 51,000 – 50,500 మధ్య సపోర్ట్ తీసుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ 51,500 కంటే పైకి వెళ్తుంటే, బుల్లిష్ ట్రెండ్ రావొచ్చంటున్నారు. నిఫ్టీ బ్యాంక్ 52,000 - 50,700 శ్రేణిలో ట్రేడవుతున్నంత వరకు, బై-ఆన్-డిప్, సెల్-ఆన్-రైజ్ విధానాన్ని సిఫార్సు చేస్తున్నారు.
F&O సూచనలు:
నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.49% పెరిగి 106.6 పాయింట్ల ప్రీమియంతో 23,438.95కి చేరుకుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ 1.59% తగ్గింది. నిఫ్టీ 50 ఏప్రిల్ 3 ఎక్స్‌పయిరీ ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్ట్రిబ్యూషన్ 23,500 కాల్ స్ట్రైక్‌లలో అత్యధికంగా ఉంటే, 23,000 పుట్ స్ట్రైక్‌లు గరిష్ట ఓపెన్ ఇంట్రెస్ట్‌ను కలిగి ఉన్నాయి.
FII/DII:
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తాత్కాలిక డేటా ప్రకారం, మంగళవారం FPIలు రూ. 5,901.63 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా మూడవ సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు, వాళ్లు రూ. 4,322.58 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
గ్లోబల్ క్యూస్:
అమెరికా అంచనా కంటే ఎక్కువ సుంకాలు విధించిన తర్వాత ఒక దశలో జపాన్ నిక్కీ 225 పాయింట్లు అంటే, 4% కంటే ఎక్కువ, కోస్పి దాదాపు 3% క్షీణించాయి. ఇది ఆసియా-పసిఫిక్ షేర్ ఇండెక్స్‌ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని ఎగుమతులపై 10% బేస్ టారిఫ్‌ను, అతని అగ్ర వాణిజ్య భాగస్వాములైన చైనా, వియత్నాం, యూరోపియన్ యూనియన్‌పై అదనపు టారిఫ్‌లను విధించారు.
వార్తలలో ప్రధాన స్టాక్‌లు:
మారుతి సుజుకి: ఏప్రిల్ 8 నుండి పెరుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ ఖర్చుల కారణంగా కంపెనీ కార్ల ధరలను పెంచనుంది. ఫలితంగా గ్రాండ్ విటారా ధర రూ. 62,000 పెరుగుతుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: ఆంధ్రప్రదేశ్‌లోని 500 కంప్రెస్డ్ బయో-గ్యాస్ ప్లాంట్ల కోసం రూ. 65,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..