Share News

Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..

ABN , Publish Date - Feb 27 , 2025 | 06:59 AM

బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. బుధవారం రోజు తగ్గిన పసిడి రేటు మళ్లీ పెరిగింది.

Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..
Gold and Silver Prices

బిజినెస్ డెస్క్: పసిడి ప్రియులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. బుధవారం తగ్గినట్లే తగ్గిన గోల్డ్ రేటు ఇవాళ (27-02-2025)కు మళ్లీ పెరిగింది. ఇప్పటికే కొండెక్కిన ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ధర రూ.90 వేలకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, https://bullions.co.in/ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న(బుధవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,421 ఉండగా.. నేడు రూ.78,678కు పెరిగింది. 24 క్యారెట్ల తులం పసిడి ధర నిన్న రూ.85,550 కాగా.. ఈరోజు రూ.85,830కు చేరుకుంది.


ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారం రూ.78,558 ఉండగా.. నేడు రూ.78,815కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర నిన్న రూ.85,700 కాగా.. గురువారం రూ.85,980 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,678 ఉండగా.. నేడు రూ.78,943కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర నిన్న రూ.85,830 కాగా రూ.86,120కు చేరింది.


ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

  • పుణె- రూ.78,815, రూ.85,980

  • భోపాల్- రూ.78,898, రూ.86,070

  • ముంబై- రూ.78,815, రూ.85,980

  • భువనేశ్వర్- రూ.78,833, రూ.86,000

  • కోయంబత్తూర్- రూ.79,044, రూ.86,230

  • బెంగళూరు- రూ.78,879, రూ.86,050

  • కోల్‌కతా- రూ.78,714, రూ.85,870

  • చెన్నై- రూ.79,044, రూ.86,230

  • జైపూర్- రూ.78,806, రూ.85,970

  • దిస్పూర్- రూ.78,980, రూ.86,160


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక, దేశవ్యాప్తంగా వెండి రేట్లు సైతం భారీగానే పెరిగాయి. ఢిల్లీలో బుధవారం కిలో వెండి రూ.94,040 ఉండగా.. గురువారానికి రూ.94,920కి పెరిగింది. ముంబైలో నిన్న కేజీ వెండి రూ.94,200 కాగా.. నేడు రూ.95,090కి చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర నిన్న రూ.94,350 ఉండగా.. నేడు రూ.95,240 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బుల్లేవ్‌

ఈక్విటీ మార్కెట్‌పై బేర్‌ పట్టు

Updated Date - Feb 27 , 2025 | 07:02 AM