Ganta Srinivasa Rao: వైజాగ్ ఫిల్మ్‌క్లబ్‌పై గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:08 PM
Ganta Srinivasa Rao: ఫిల్మ్‌క్లబ్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్‌క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని అన్నారు.

విశాఖపట్నం: వైజాగ్ ఫిల్మ్‌క్లబ్ కోసం కొన్ని రోజులుగా వ్యతిరేక వార్తలు వినిపిస్తున్నాయని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నం తిమ్మాపురం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌ను గంటా శ్రీనివాసరావు, నార్త్ ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 2015లో విశాఖపట్నంలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్ వచ్చే విధంగా అప్పట్లో చర్యలు తీసుకున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్‌క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని గంటా శ్రీనివాసరావు అన్నారు. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన వైజాగ్ ఫిల్మ్‌క్లబ్ దారి తప్పిందని చెప్పారు. లైఫ్ మెంబర్ షిప్ క్లబ్‌లో ఉండవని అన్నారు. ఈ వింత పోకడ వైజాగ్ కల్చరల్ క్లబ్‌లో తీసుకొచ్చారని.. పాత కమిటీ రాజీనామా చేసిందని తెలిపారు. ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. 1500 మంది సభ్యులు ఫిల్మ్‌క్లబ్‌లో ఉన్నారని గంటా శ్రీనివాసరావు గుర్తుచేశారు.
ఫిల్మ్‌క్లబ్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఫిల్మ్‌క్లబ్‌కు భూకేటాయింపు చేసి భవనాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందరూ వైజాగ్‌కు ఫిలిం పరిశ్రమ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. బెస్ట్ మోడల్ క్లబ్‌గా వైజాగ్ ఫిల్మ్‌క్లబ్‌ను తీర్చిద్ధిద్దుతామని తెలిపారు. సినిమాలకు విశాఖపట్నం ఒక సెంటిమెంట్ ప్రాంతమని అన్నారు. సినిమా పెద్దలు విశాఖ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వైజాగ్‌ను ఫిల్మ్‌హబ్‌గా తయారుచేయాలని ఆలోచన చేస్తున్నామని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
వైజాగ్ ఫిల్మ్‌క్లబ్‌కు ప్రక్షాళన చేయాలి: ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
వైజాగ్ ఫిల్మ్‌క్లబ్‌కు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. క్లబ్ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఫిల్మ్‌క్లబ్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేశానని చెప్పారు. క్లబ్ ఎన్నికలకు రాజకీయంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. క్లబ్ ప్రక్షాళనకు అందరూ సహకారం అందించాలని కోరారు. క్లబ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. తమకు ఈ విషయంలో వ్యక్తిగత స్వార్థం లేదని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
59 ఏళ్ల వయసులో చెట్టెక్కిన హీరో
Read Latest AP News And Telugu News