ఎంస్ఎంఈల టర్నోవర్, పెట్టుబడుల పరిమితి పెంపు
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:22 AM
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) పెట్టుబడి, టర్నోవర్ పరిమితులు గణనీయంగా పెంచుతూ చేసిన సవరణలు మంగళవారం (ఏప్రిల్ 1) అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం...

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) పెట్టుబడి, టర్నోవర్ పరిమితులు గణనీయంగా పెంచుతూ చేసిన సవరణలు మంగళవారం (ఏప్రిల్ 1) అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం ఎంఎ్‌సఎంఈ నిర్వచనాన్ని ఇటీవల సవరించింది. వాటి వృద్ధి, విస్తరణ అవకాశాలు మెరుగు పడి ఉపాధి కల్పనకు ఈ సవరణ దోహదపడుతుంది.
రూ.2.5 కోట్ల పెట్టుబడి గల కంపెనీలు ఇక నుంచి మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లుగా పరిగణనలోకి వస్తాయి. గతంలో ఈ పరిమితి రూ.1 కోటి ఉండేది. వీటి టర్నోవర్ పరిమితిని కూడా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు.
రూ.25 కోట్ల పెట్టుబడి గల సంస్థలు చిన్న పరిశ్రమలుగా వర్గీకరణలోకి వస్తాయి. గతంలో ఇది రూ.10 కోట్లుండేది. వాటి టర్నోవర్ పరిమితిని రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు.
రూ.125 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యే సంస్థలను మధ్యతరహా పరిశ్రమలుగా గుర్తిస్తారు. గతంలో ఈ పరిమితి రూ.25 కోట్లుండేది. వీటి టర్నోవర్ పరిమితిని రూ.500 కోట్లకు పెంచారు.
ఇవి కూడా చదవండి..
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా