అంతర్జాతీయ పరిణామాలే కీలకం!
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:32 AM
నేటి నుంచి సరికొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. గడచిన కొద్ది నెలలుగా మార్కెట్లు మదుపరులకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. తీవ్రమైన అనిశ్చితి నెలకొని ఉంది. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి తప్పకపోవచ్చు...

నేటి నుంచి సరికొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. గడచిన కొద్ది నెలలుగా మార్కెట్లు మదుపరులకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. తీవ్రమైన అనిశ్చితి నెలకొని ఉంది. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి తప్పకపోవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు ఏప్రిల్ తొలి వారంలో అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఆర్‌బీఐ ద్రవ్వ పరపతి విధాన సమీక్ష, అమెరికా ఆర్థిక గణాంకాలు కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. వీటిని బట్టి మదుపరులు పొజిషన్స్ తీసుకోవటం మంచిది. మూమెంటమ్‌ను పరిశీలిస్తే పీఎ్‌సయూ బ్యాంకులు, ఫైనాన్స్, ఎనర్జీ, హెల్త్‌కేర్, కమోడిటీస్ రంగాలు బుల్లి్‌షనె్‌సను కనబరిచే వీలుంది.
స్టాక్ రికమండేషన్స్
టాటా కన్స్యూమర్: జీవితకాల గరిష్ఠం నుంచి 30 శాతం వరకు దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్ జోన్‌లో ఉంది. రూ.880 స్థాయిలో మద్దతు తీసుకున్న ఈ షేరు తాజాగా హయ్యర్ హైఫామ్ చేసింది. చివరి రెండు సెషన్లలో 5 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం రూ.1,001 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.990 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,080 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.960 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బ్రిటానియా: ప్రస్తుతం రూ.4,600 స్థాయిలో సపోర్ట్ తీసుకున్న ఈ షేరు జోరును ప్రదర్శిస్తోంది. చివరి నాలుగు సెషన్లు లాభాల్లోనే ముగిసింది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.4,936 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.4,900 స్థాయిలో ప్రవేశించి రూ.5,500 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,855 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
అపోలో హాస్పిటల్స్: ఈ ఏడాది ఆరంభం నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరులో ప్రస్తుతం అక్యుములేషన్ జరుగుతోంది. రూ.6,000 స్థాయిలో రెండుసార్లు సపోర్ట్ తీసుకుని అప్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ప్రస్తుతం 50 రోజుల మూవింగ్ యావరేజెస్ పైన కదలాడుతోంది. గత శుక్రవారం రూ.6,616 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.6,600 వద్ద పొజిషన్ తీసుకుని రూ.7,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.6,550 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఐఆర్‌సీటీసీ: గత ఏడాది జూలై నుంచి ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతం భారీ వాల్యూమ్ నమోదవుతుండటంతో అక్యుములేషన్ జరుగుతోందని భావించవచ్చు. పైగా చివరి పది సెషన్లలో 11 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.727 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.700 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.770/820 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.675 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎస్‌బీ కార్డ్: నష్టాల మార్కెట్లోనూ మంచి లాభాలు నమోదు చేసిన షేరు ఇది. చివరి మూడు నెలల్లో 26 శాతం, చివరి నెల రోజుల్లో 5 శాతం, గత వారం 3 శాతం మేర పెరిగింది. గత ఏడాది సెప్టెంబరు నాటి రూ.820 స్థాయిని అధిగమించిన ఈ షేరు ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతోంది. గత శుక్రవారం రూ.881 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.850 వద్ద పొజిషన్ తీసుకుని రూ.1,020 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.820 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
Malaika Arora: మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్.. 51 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్‌తో డేటింగ్
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడా