Share News

మార్కెట్లో ట్రంప్‌ సుంకంపం!

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:36 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరానికి (2025-26) భారీ నష్టాలతో స్వాగతం పలికాయి. ఈ నెల 2 నుంచి ట్రంప్‌ పరస్పర సుంకాలు అమలు చేయనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై భారీగా...

మార్కెట్లో ట్రంప్‌ సుంకంపం!

సెన్సెక్స్‌ 1,390 పాయింట్లు పతనం

భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం

23,200 దిగువ స్థాయికి జారిన నిఫ్టీ

రూ.3.44 లక్షల కోట్ల సంపద ఉఫ్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరానికి (2025-26) భారీ నష్టాలతో స్వాగతం పలికాయి. ఈ నెల 2 నుంచి ట్రంప్‌ పరస్పర సుంకాలు అమలు చేయనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో ప్రామాణిక సూచీలు కుప్పకూలాయి. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 1,390.41 పాయింట్లు (1.80 శాతం) క్షీణించి 76,024.51 వద్దకు జారుకుంది. ఒక దశలో సూచీ 1,502 పాయింట్ల మేర క్షీణించి 76,000 స్థాయిని సైతం కోల్పోయినప్పటికీ, తిరిగి నిలబెట్టుకోగలిగింది. కొవిడ్‌ సంక్షోభ కాలమైన 2020లో చవిచూసిన మార్కెట్‌ పతనం తర్వాత సెన్సెక్స్‌కు ఆర్థిక సంవత్సర ప్రారంభం రోజున ఇదే అతిపెద్ద నష్టం. అంతేకాదు, సూచీకి గడిచిన నెల రోజుల్లో ఇదే అతిపెద్ద ఒక్కరోజు క్షీణత కూడా. నిఫ్టీ విషయానికొస్తే, 353.65 పాయింట్ల (1.50 శాతం) పతనమై 23,165.70 వద్ద స్థిరపడింది. అమ్మకాలు పోటెత్తడంతో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3.44 లక్షల కోట్లు తగ్గి రూ.409.43 లక్షల కోట్లకు (4.78 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.


సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 28 నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.87 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కూడా 3 శాతానికి పైగా పతనమయ్యాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా స్టాక్స్‌ 2.81 శాతం వరకు నష్టపోగా.. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.77 శాతం తగ్గింది. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ మాత్రం 5.11 శాతం ఎగిసి సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కాగా, బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌ సూచీ 1.04 శాతం నష్టపోగా.. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ అతిస్వల్ప లాభాన్ని నమోదు చేసింది. రంగాలవారీ సూచీల్లో టెలికాం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా అన్నీ నేలచూపు చూశాయి. రియల్టీ ఇండెక్స్‌ 3.05 శాతం క్షీణించగా.. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఐటీ, ఫోకస్డ్‌ ఐటీ రెండు శాతానికి పైగా పతనమయ్యాయి.


వొడాఫోన్‌ ఐడియా షేరు

19 శాతం అప్‌

ప్రైవేట్‌ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా షేరు దాదాపు 19 శాతం పెరిగి రూ.8.10 వద్ద ముగిసింది. కంపెనీ చెల్లించాల్సిన రూ.36,950 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం సంస్థలో ఈక్విటీ వాటాగా మార్చుకున్న నేపథ్యంలో షేరుకు డిమాండ్‌ భారీగా పెరిగింది.

ఇవి కూడా చదవండి:

Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 02 , 2025 | 04:36 AM