Share News

Pooja Timings: మీ పూజలకు ప్రతిఫలం దక్కాలంటే.. ఇవి తప్పక తెలుసుకొండి

ABN , Publish Date - Mar 29 , 2025 | 08:54 AM

మనలో చాలా మందికి ప్రతి రోజు పూజ చేసే అలవాటు ఉంటుంది. ఉదయం పూజ పూర్తి చేసుకున్న తర్వాతే మిగతా పనులు ప్రారంభిస్తారు కొందరు. అయితే పూజ ఏ సమయంలో చేయాలి.. సమయం దాటిన తర్వాత చేస్తే ఏం జరుగుతుంది.. దీనిపై పండితులు ఏమంటున్నారంటే..

Pooja Timings: మీ పూజలకు ప్రతిఫలం దక్కాలంటే.. ఇవి తప్పక తెలుసుకొండి
Pooja Timings

సాధారణంగా చాలా మంది హిందువులకు నిత్యం పూజ చేయడం అలవాటు. దేవుడికి దీపం పెట్టంది పచ్చి గంగ కూడా ముట్టరు కొందరు. ఒకప్పుడంటే.. ఉదయం లేచి ప్రశాంతంగా పూజ చేసుకుని.. రోజు ప్రారంభించేవారు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా సమయం ఉండటం లేదు. పైగా పూజా సమయానికి సంబంధించి జనాల్లో చాలా ఆపోహలు ఉన్నాయి. ఉదయం ఏ సమయంలోపు పూజ చేయాలనే దానిపై అనేక సందేహాలున్నాయి. మరి దీనిపై శాస్త్రాలు, పెద్దలు ఏం చేబుతున్నారు.. పూజ చేసుకోవడానికి సరైన సమయం ఏది అంటే.


ఉదయం సూర్యోదం అయిన 2, 3 గంటలలోపే పూజ పూర్తి చేయాలని పండితులు చేబుతున్నారు. అంటే మార్నింగ్ 6-9 గంటల మధ్య పూజ పూర్తి చేయడం ఉత్తమం. ఈ సమయాన్ని బ్రహ్మ ముహుర్త సమయం తర్వాత వచ్చే పవిత్ర కాలంగా భావిస్తారు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండటమే కాక.. వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అందుకే ఈ సమయంలో పూజ చేస్తే.. దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తాయని పెద్దలంటున్నారు. అలానే ఆయుర్వేదం ప్రకారం కూడా ఉదయం తొలి గంటల్లో శరీరం, మనసు చాలా బాగుంటాయని.. ఈ సమయంలో పూజ చేస్తే ఆధ్యాత్మికంగానే కాక.. మానసికంగా కూడా బాగుంటుందని అంటున్నారు.

ఉదయం 9 తర్వాత పూజ చేయకూడదా..

సూర్యోదయం తర్వాత అనగా.. ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి "రాహుకాలం","దుష్ట సమయం" ప్రభావం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమయంలో పూజ చేస్తే అంతగా ఫలితం ఉండదని.. పైగా కొన్ని సందర్భాల్లో ప్రతికూల శక్తులు కూడా ఆకర్షితమవుతాయని కొందరు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలానే ఉదయం ఆలస్యంగా పూజ చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం తగ్గుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.


పూజ ఆలస్యమైతే ఏమవుతుంది..

పూజ చేయడం ఆలస్యం కావడం వల్ల తప్పు జరుగుతుందని ఎక్కడా నిర్ధారణ చేయలేదు. కానీ పూజ ఆలస్యం అయితే.. వ్యక్తిగత దినచర్యలో క్రమశిక్షణ తప్పుతుంది, మానసిక ప్రశాంతత కరువవుతుంది అంటున్నారు పండితులు. అలానే కొందరు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల పూజ ఆలస్యం అవుతుందని వెల్లడిస్తున్నారు. కనుక ఉదయం 9 గంటల లోపు పూజ పూర్తి చేసి.. మానసిక ప్రశాంతత పొందండి అంటున్నారు పండితులు.

Updated Date - Mar 29 , 2025 | 08:58 AM