Japan: జపాన్‌కు మెగాక్వేక్ సూచన.. ఇక వినాశనమే..
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:01 AM
Japan: రెండు భూకంపాల దెబ్బకే మయన్మార్ అతాలాకుతలం అయింది. అలాంటిది జపాన్ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుంది. మెగాక్వేక్ వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మెగాక్వేక్ కారణంగా 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వెల్లడించింది.

మయన్మార్‌లో గత శుక్రవారం మధ్యాహ్నం వరుసగా రెండు భూకంపాలు వచ్చిన సంగతి తెలిసిందే. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపాల కారణంగా మయన్మార్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మూడు వేలకు పైగా మంది మరణించారు. మరో మూడు వేలకు పైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. భూకంపాలు వచ్చి వారం రోజులు అవుతున్నా.. మయన్మార్ ఇంకా కోలేకపోతోంది. భూకంపాల దాటికి మయన్మార్ పరిస్థితి ఇలా తయారైంది. మరి, మెగాక్వేక్ వస్తే పరిస్థితి ఏంటి? ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. అలాంటి భయంకరమైన అనుభవాన్ని జపాన్ చవి చూడబోతోంది.
మరికొద్ది రోజుల్లో జపాన్ మెగాక్వేక్ బారినపడే అవకాశం ఉంది. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. త్వరలో కాటిస్ట్రోఫిక్ మెగాక్వేక్ వచ్చే అవకాశం ఉందని అంది. మెగాక్వేక్ కారణంగా సునామీలు సైతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మెగాక్వేక్ కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. దాదాపు 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో అక్కడి ప్రజల గుండెల్లో ఇప్పటినుంచే వణుకు మొదలైంది. ఎప్పుడు మెగాక్వేక్ వస్తుందోనని భయపడి చస్తున్నారు. కాగా, జపాన్ ప్రభుత్వం గత సంవత్సరం మొదటి సారి మెగాక్వేక్ హెచ్చరికలు జారీ చేసింది.
భూకంపం తీవ్రత రెక్టార్ స్కేలుపై 9 నుంచి 7 వరకు ఉండొచ్చని తెలిపింది. ఇక,ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు వచ్చే దేశంగా జపాన్ టాప్‌లో ఉంది. ఇక్కడ వచ్చే 80 శాతం భూకంపాలు రెక్టార్ స్కేలుపై 8 నుంచి 9 శాతం నమోదవుతున్నాయి. అత్యంత అరుదుగా మెగాక్వేక్‌లు వస్తుంటాయి. 100 నుంచి 150 సంత్సరాల కొకసారి మెగాక్వేక్‌లు జపాన్‌ను పలకరిస్తూ ఉన్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఒక వేళ జపాన్‌లో భూకంపం వస్తే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. 1.81 ట్రిలియన్ డాలర్ల నష్టం వస్తుంది. రాబోయే నష్టం విలువ జపాన్ జీడీపీలో సగం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
మొగలుల పాలనా అంశాల్ని పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించారు : సోనియా గాంధీ
Stock Market Opening Bell: నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు, తర్వాత దూకుడు