Gas Cylinders: గ్యాస్ వాడకం దారులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:41 AM
గత కొద్ది రోజులుగా వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వచ్చిన ఆయిల్ కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజునే గుడ్ న్యూస్ చెప్పాయి.

దేశంలోని ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి రోజునే (ఏప్రిల్ 1, 2025) శుభవార్త చెప్పారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొన్ని నెలలుగా గృహ అవసరాలకు ఉపయోగించే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తుండగా, ఈసారి కూడా వాటి ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. కానీ, వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఉపశమనం కల్పించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఒక్కో సిలిండర్‌పై రూ. 41 మేర తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2025 నుంచే అమలులోకి వస్తాయని తెలిపాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1803 నుంచి రూ. 1762కి దిగివచ్చింది.
ఇక నగరాల వారీగా సిలిండర్ ధరలు చూస్తే, దేశ రాజధాని ఢిల్లీలో కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 41 తగ్గి రూ. 1762 వద్దకు వచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1755.50 నుంచి రూ. 1714.50కి తగ్గింది. చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1965.50 నుంచి రూ. 1924.50కి తగ్గింది. కోల్‌కతాలో కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 1913 నుంచి రూ. 1872 వద్దకు దిగివచ్చింది. సాధారణంగా ఒకటో తేదీతో పాటు ప్రతి నెలా 15వ తేదీనా గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తాయి.
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..