Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనాలంటే ఇదే కరెక్ట్ టైమ్..
ABN , Publish Date - Mar 31 , 2025 | 06:47 AM
దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధర రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగుతూ పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తోంది.

బిజినెస్ న్యూస్: కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ (31-03-2025) ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,593 కాగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.89,010 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.81,730 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,160కు చేరింది. ఇక, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,868 కాగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.89,310గా ఉంది. అయితే ఇటీవల రూ.90 వేల మార్కును దాటిన గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టడం పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
బెంగళూరు- రూ.81,794, రూ.89,230
పుణె- రూ.81,730, రూ.89,160
అహ్మదాబాద్- రూ.81,840, రూ.89,280
భువనేశ్వర్- రూ.81,758, రూ.89,190
భోపాల్- రూ.81,822, రూ.89,260
కోల్‌కతా- రూ.81,629, రూ.89,050
చెన్నై- రూ.81,968, రూ.89,420
కోయంబత్తూర్- రూ.81,968, రూ.89,420
పట్నా- రూ.81,693, రూ.89,120
సూరత్- రూ.81,840, రూ.89,280
వెండి ధర పరిస్థితి ఇది..
ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ధరలు స్వల్ప తేడాతో యథావిధిగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో సోమవారం ఉదయం 06:30 గంటల సమయానికి కేజీ వెండి ధర రూ.1,00,410 కాగా.. ముంబైలో రూ.100,590 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,740కి చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
బ్రోకరేజీ కింగ్ నిఖిల్ కామత్
వచ్చే ఏడాది 6.5ు%వృద్ధి ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా