Jobs: ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..చివరి తేదీ ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:16 PM
యువత కోసం IRCTC మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో టెన్త్, ఐటీఐ లేదా గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్ అవకాశాలను ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

మీరు ITI, 10వ తరగతి లేదా గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 25 Apprentice (అప్రెంటిస్) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఎలాంటి ఎగ్డామ్ లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా IRCTC Apprentice పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులు IRCTC అధికారిక వెబ్‌సైట్ (irctc.com) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IRCTC Apprentice Recruitment 2025 వివరాలు
పోస్టు పేరు: IRCTC Apprentice
పోస్టు విడుదల తేదీ: 25-03-2025
చివరి తేదీ: 07-04-2025
IRCTC Apprentice 2025 అర్హత ప్రమాణాలు
కనిష్ట వయసు: 15 సంవత్సరాలు
గరిష్ట వయసు: 25 సంవత్సరాలు
వయో పరిమితిలో సడలింపు ఉండవచ్చు
ITI, 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ లేదా సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
స్కూల్ ఉత్తీర్ణులైన వారికి (5వ నుంచి 9వ తరగతి): రూ. 5000/- ప్రతి నెల
10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి : రూ. 6000/- ప్రతి నెల
12వ తరగతి ఉత్తీర్ణులైన వారికి : రూ. 7000/- ప్రతి నెల
నేషనల్ లేదా స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్లకు : రూ. 7700/- ప్రతి నెల
టెక్నీషియన్ (వోకేషనల్) ఆప్రెంటిస్ లేదా వోకేషనల్ సర్టిఫికేట్ హోల్డర్లకు : రూ. 7000/- ప్రతి నెల
టెక్నీషియన్ ఆప్రెంటిస్ లేదా డిప్లొమా హోల్డర్లకు : రూ. 8000/- ప్రతి నెల
గ్రాడ్యుయేట్ ఆప్రెంటిస్ లేదా డిగ్రీ హోల్డర్లకు : రూ. 9000/- ప్రతి నెల
ఎలా దరఖాస్తు చేయాలి?
వెబ్‌సైట్‌లోకి వెళ్లి: irctc.com
Apprentices Recruitment 2025 నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి
దరఖాస్తు ఫారంలో మీ వివరాలను నమోదు చేసి, అప్లై చేయండి
అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించండి
ఆ తర్వాత అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయండి
ఎంపిక విధానం
పోస్టులకు అభ్యర్థుల ఎంపిక అనుభవం లేదా ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Indian Navy: టెన్త్ క్లాస్ పాసై, ఈత వస్తే చాలు..నెలకు రూ.80 వేల జీతం, ఇప్పుడే అప్లై చేయండి..
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
Read More Business News and Latest Telugu News

ఎన్టీపీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్..ఈ అభ్యర్థులకు మంచి ఛాన్స్

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..అప్లై చేశారా

అడ్మిషన్లలో కార్పొ‘రేట్’ దందా..

ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు..అద్భుతమైన ఛాన్స్, మిస్ కావొద్దు..

ఈ పోస్టులకు అప్లై చేశారా..టెన్త్ అర్హత, రన్నింగ్ చేస్తే, 40 వేల జీతం
