Share News

Elon Musk: ఆష్లే‌పై మస్క్ సంచలన కామెంట్లు.. ఆ బిడ్డ నాదో కాదో తెలీదు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 09:19 AM

Elon Musk AND ashley Ashley St Clair: మాజీ ప్రియురాలిపై ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు. తమకు పుట్టిన బిడ్డపై అనుమానం ఉందని అన్నాడు. ఆ బిడ్డ తనదో కాదో తెలీదంటూ కామెంట్లు చేశాడు. అమెరికాకు చెందిన లారా లూమర్ కూడా ఆష్లేపై దారుణమైన కామెంట్లు చేసింది. ఆమెను డబ్బున్న మగాళ్లకు వలవేసే ఆడదానిగా అభివర్ణించింది.

Elon Musk: ఆష్లే‌పై మస్క్ సంచలన కామెంట్లు.. ఆ బిడ్డ నాదో కాదో తెలీదు..
Elon Musk AND ashley Ashley St Clair

ప్రపంచ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ మాజీ ప్రియురాలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆష్లే సెయింట్ క్లేర్‌పై సంచలన కామెంట్లు చేశారు. ఇద్దరికీ పుట్టిన బిడ్డపై అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆ బిడ్డ తనకు పుట్టిన బిడ్డో కాదో అంటూ బాంబు పేల్చారు. అసలు విషయం ఏంటంటే.. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఆష్లేతో రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరికీ మగ బిడ్డ పుట్టాడు. ఎలన్ మస్క్‌కు ఆ బిడ్డ 13వ సంతానం. బిడ్డ పుట్టిన తర్వాత ఇద్దరూ వేరుపడ్డారు. ఈ నేపథ్యంలోనే మస్క్ ఆమెకు ఖర్చుల కింద ప్రతీ ఏటా 5 లక్షల డాలర్లు ఇస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు 2.5 మిలియన్ డాలర్లు ఆమెకు ఇచ్చాడు. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా..


21 కోట్ల రూపాయలు పైమాటే. ఇప్పటికి కూడా ఆష్లేకు డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. ఇలాంటి టైంలో అమెరికాకు చెందిన ప్రముఖ సెలెబ్రిటీ లారా లూమర్ ఆష్లేపై ట్విటర్ వేదికగా వివాదాస్పద పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ డబ్బున్న మగాళ్లకు వలవేసే ఆష్లే అత్యంత ఖరీదైన కారులో తిరుగుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయింది. దాని విలువ లక్ష డాలర్లు ఉంటుంది. రిలేషన్‌లో ఉన్నపుడు దాన్ని ఎలన్ మస్క్ బహుమతిగా ఇచ్చాడని గర్వంగా చెప్పుకుని తిరుగుతోంది’ అంటూ ఫైర్ అయింది. దీనిపై ఎలన్ మస్క్ స్పందించాడు. లారా లూమర్‌ పోస్టుకు రిప్లై ఇస్తూ.. ‘ ఆ పిల్లాడు నా బిడ్డా కాదా అని నాకు తెలీదు. కానీ, ఆ బిడ్డ ఎవరో తెలుసుకోవాలని నేను అనుకోవటం లేదు.


కోర్డు ఆర్డర్లు కూడా అవసరం లేదు. వాస్తవం ఏంటో తెలీదు కాబట్టి.. నేను ఆమెకు ఇప్పటి వరకు 21 కోట్ల రూపాయలు ఇచ్చాను. ప్రతీ సంవత్సరం 5 లక్షల డాలర్లు పంపాను’ అని అన్నాడు. మస్క్ పెట్టిన పోస్టుపై ఆష్లే స్పందించింది. ఈ మేరకు మంగళవారం ఓ పోస్టు పెట్టింది. ‘ పిల్లాడు గర్భంలో ఉన్నపుడే .. తండ్రి ఎవరో తెలుసుకోవడానికి పరీక్ష చేయించమని చెప్పాను. నువ్వు వద్దన్నావు. నువ్వు నాకు డబ్బులు పంపటం లేదు. మన పిల్లాడి కోసం పంపుతున్నావు. నన్ను ఇబ్బంది పెట్టడానికి తక్కువ డబ్బులు ఇస్తున్నావు. కానీ, నువ్వు నీ కొడుకును ఇబ్బందిపెడుతున్నావు. సోషల్ మీడియా నా పరువు తీయడానికి చూస్తున్నావు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి:

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

Viral Video: నువ్వు నిజంగా హీరోవి బాసు.. కత్తికి కూడా భయపడలేదు..

Updated Date - Apr 01 , 2025 | 09:21 AM