US Protest: 'అమెరికాను నాశనం చేయడం ఆపండి'
ABN , Publish Date - Apr 06 , 2025 | 08:48 AM
ట్రంప్ తెచ్చిన కొత్త ట్రేడ్ టారిఫ్స్ ఫలితంగా అమెరికా వాణిజ్య వ్యవస్థ ఒక్కసారిగా షేక్ అవడాన్ని నిరసన కారులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సందట్లో సడేమియాలా..

అమెరికన్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీద నిరసనల బాట పట్టారు. ఇటీవల ట్రంప్ ప్రకటించిన ఇంటర్నేషనల్ ట్రేడ్ టారిఫ్స్ అంశం అమెరికా మార్కెట్లను పాతాళానికి నెట్టిన సమయంలో ఇదే అదునుగా నిరసనకారులు రోడ్లెక్కారు. ట్రంప్, అతని సలహాదారుడు ఎలాన్ మస్క్ లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీస్తున్నారు. 'అమెరికాను నాశనం చేయడం ఆపండి' అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజీ(DOGE) అధిపతి.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చర్యలకు నిరసనగా నిన్న (ఏప్రిల్ 5, శనివారం) దేశవ్యాప్తంగా 'హ్యాండ్స్ ఆఫ్!' అంటూ నిరసనలకు నిరసనకారులు ఏకమయ్యారు.
ట్రంప్.. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వరంగ సత్వర ప్రక్షాళనుకు శ్రీకారం చుట్టారు. డోజ్ సూచనల మేరకు మొదటి కొన్ని వారాల వ్యవధిలోనే పెద్దగా పనిలేని ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు పెద్ద ఎత్తున చేపట్టారు. వ్యవస్థలో ఉన్న "వ్యర్థాలను తగ్గించడానికి" తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఇది బాధితులకు ఏమాత్రం నచ్చడంలేదు. దీంతో అటు, విద్యాశాఖను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా జరుగుతోందంటూ నిరసన కారులు ఆందోళన చేస్తున్నారు.. వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ దగ్గర పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. టూల్ కిట్‌ల ప్లాన్ ప్రకారం వివిధ గ్రాస్ రూట్ అడ్వకసీ గ్రూపులు, ఇతర వ్యతిరేక సంస్థలు ఆందోళనల్లో పాల్గొంటున్నాయి.
అయితే, వీటన్నింటినీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్దగా పట్టించుకోవడం లేదు. వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ఒక పత్రికకు ఇచ్చిన ప్రకటనలో నిరసనలపై వ్యాఖ్యానించారు. "నిరసనలు, దావాలు, చట్టపరమైన యుద్ధాలు అధ్యక్షుడు ట్రంప్‌ను నిరుత్సాహపరుస్తాయని ఎవరైనా భావిస్తే, వారు గత కొన్ని సంవత్సరాలుగా రాయి కింద నిద్రపోతూ ఉండాలి. అధ్యక్షుడు ట్రంప్ మా ఫెడరల్ ప్రభుత్వాన్ని మరింత సమర్థవంతంగా, దేశవ్యాప్తంగా ఉన్న కష్టపడి పనిచేసే అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు మరింత జవాబుదారీగా చేయడానికి చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో నిరుత్సాహపడరు." అన్నారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here