Share News

Elon Musk: ఎక్స్(X)ను అమ్మేసిన ఎలాన్ మస్క్

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:38 AM

ప్రపంచవ్యాప్తంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్ స్కిల్స్ అనుసంధానం చేయడానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో వినూత్న స్టెప్ తీసుకున్నారు. ఇది ప్రపంచాన్నే ప్రతిబింబిస్తుందని, మానవ పురోగతిని మరింత వేగవంతం చేస్తుందని విశ్వసిస్తున్నారు.

Elon Musk: ఎక్స్(X)ను అమ్మేసిన ఎలాన్ మస్క్
X Elon Musk

అగ్రరాజ్యం అమెరికాని తన కనుసన్నల్లో నడిపిస్తున్నారనే విమర్శలేకాదు, ప్రశంసలు కూడా అందుకుంటున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ట్రంప్ సర్కారుకు సీనియర్ సలహాదారుగా, ఒక ప్రక్క టెస్లా, మరోప్రక్క తన స్పేస్ ఎక్స్ సంస్థ సాధిస్తోన్న విజయాలతో మరింత అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. 2022 అక్టోబర్ లో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఆ సంస్థను అమ్మేసినట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఎక్స్‌కు 600 మిలియన్ల మంది యూజర్ల ఉన్నారని,‘ఈరోజు మేము అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, ప్రతిభను అనుసంధానం చేయడానికి అడుగు వేస్తున్నాం.. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని మరింత వేగవంతం చేసే సమర్ధవంతమైన వేదికను నిర్మించడానికి మాకు వీలు కల్పిస్తుంది.’ అని మస్క్ పేర్కొన్నారు.


అయితే ఈ డీల్ బయట వ్యక్తులు లేదా సంస్థలతో మాత్రం కాదు. ఎలాన్ మస్క్ తన స్వంత ఏఐ స్టార్టప్ కంపెనీ అయిన 'ఎక్స్‌ఏఐ' (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ) కు మాత్రమే విక్రయించడం గమనార్హం. ఈ మేరకు ఎక్స్‌లో మస్క్ పోస్ట్ చేశారు. మొత్తం 33 బిలియన్ డాలర్ల (అంటే 2.80 లక్షల కోట్లు)కు ఎక్స్‌ను అమ్మేసినట్లు చెప్పారు. దీంతో ప్రస్తుతం 'ఎక్స్ఏఐ' విలువ 80 బిలయన్ డాలర్లుగా మస్క్ తెలిపారు. ఈ లావాదేవీ పూర్తిగా స్టాక్ రూపంలో జరిగిందని, దీంతో xAI విలువ $80 బిలియన్లుగా ఉందని మస్క్ పేర్కొన్నారు. 'ఎక్స్' విలువ $33 బిలియన్లుగా (విలువ $45 బిలియన్, ఇందులో అప్పులు $12 బిలియన్)గా అంచనా వేశామని మస్క్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.


అధునాత ఏఐ టెక్నాలజీని ఎక్స్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మస్క్ తన పోస్టులో తెలిపారు. ఈ ప్రకటన టెక్ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఇది మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో మరో కొత్త వ్యూహాత్మక మలుపుగా భావిస్తున్నారు. ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసి, దాని పేరును 'ఎక్స్'గా మార్చారు. అప్పటి నుంచి ఈ వేదికలో సిబ్బంది తగ్గింపు, కంటెంట్ మోడరేషన్ నిబంధనల సడలింపు, ధృవీకరణ విధానాల సవరణ వంటి అనేక మార్పులు, ఇంకా గ్రోక్ ఫీచర్ వంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఈ నిర్ణయాల వల్ల మొదట్లో ప్రకటనదారులు దూరమవడం, వివాదాలు చెలరేగడం జరిగినప్పటికీ, 2025 నాటికి 'ఎక్స్' తన విలువను చాలావరకూ పునరుద్ధరించుకుంది, $1 బిలియన్ కొత్త ఈక్విటీ సేకరించగలిగింది.


ఇవి కూడా చదవండి:

ఉన్నదంతా అమ్మేసి.. 42 అడుగుల పడవపైన.. ఇదో వింత కథ..

బ్రష్‌తో బైక్‌నే నడిపించాడుగా.. ఇతడి టెక్నిక్ చూస్తే కళ్లు తేలేస్తారు..

Updated Date - Mar 29 , 2025 | 11:34 AM

Updated Date - Mar 29 , 2025 | 11:38 AM