India-China: భారత్-చైనా సంబంధాలు ఏనుగు-డ్రాగన్ టాంగో రూపంలో ఉండాలి: చైనా అధ్యక్షుడు
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:23 PM
చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు మంగళవారం అభినందన సందేశాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందనలు తెలియజేశారు.

చైనా (China), భారత్ (India) దేశాలు మరింత స్నేహపూర్వకంగా కలిసి పని చేయాలని, మన బంధం ఏనుగు-డ్రాగన్ టాంగో రూపంలో ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షులు మంగళవారం అభినందన సందేశాలను ఇచ్చిపుచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందనలు తెలియజేశారు. ఇరు దేశాల సంబంధాలు శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మారడానికి మార్గాలను కనుగొనాలని, ప్రధాన అంతర్జాతీయ వ్యవహారాల్లో కమ్యూనికేషన్, సమన్వయాన్ని మరింతగా పెంచుకోవాలని జిన్‌పింగ్ సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతిని కాపాడడంలో భారత్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నానని జిన్‌పింగ్ అన్నారు.
కాగా, బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు అయిన మహమ్మద్ యూనస్ ఇటీవల నాలుగు రోజులు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇండియాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పర్యటనలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసి బీజింగ్‌తో తొమ్మిది ఒప్పందాలపై సంతకం చేసిన యూనస్.. చైనాను ఆకర్షించేందుకు భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..