Gaza Protest Erupts: గద్దె దిగు హమాస్ మాకు శాంతి కావాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:57 AM
గాజా వీధులు హమాస్ వ్యతిరేక ఆందోళనలతో మిన్నంటాయి. వందలాదిమంది పాలస్తీనియన్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ‘హమాస్ గద్దె దిగు. యుద్ధం విరమించాలి.

గాజా వీధుల్లో మిన్నంటిన ఆందోళనలు
గాజా, మార్చి 26: గాజా వీధులు హమాస్ వ్యతిరేక ఆందోళనలతో మిన్నంటాయి. వందలాదిమంది పాలస్తీనియన్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ‘హమాస్ గద్దె దిగు. యుద్ధం విరమించాలి. మేమంతా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాం. అవుట్ అవుట్ హమాస్ అవుట్. హమాస్ ఉగ్రవాదులు’ అంటూ నినాదాలు హోరెత్తించారు. హమాస్ మిలిటెంట్లు ముఖాలకు మాస్కులు ధరించి లాఠీలతో ఆందోళనకారులపై విరుచుకుపడి, వారందరినీ అక్కడి నుంచి తరిమేశారు. శాంతియుత ప్రదర్శనలో పాల్గొనాలని టెలిగ్రామ్ యాప్‌లో చేసిన అభ్యర్థనల మేరకు తామంతా ప్రదర్శనలో పాల్గొన్నామని ఆందోళనకారులు తెలిపారు. ‘ఈ ప్రదర్శనను ఎవరు నిర్వహించారో తెలియదు. యుద్ధంతో విసిగిపోయాం. ప్రజల తరఫున సందేశం ఇచ్చేందుకే ఈ ప్రదర్శనలో పాల్గొన్నా’ అని మొహమ్మద్ అనే వ్యక్తి తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 50 వేలమందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.