Share News

పాపం.. యువతి విచిత్ర జీవితం.. టాయిలెట్‌‌లొ అద్దెకు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:35 PM

ఆమెకు నెలకు 31 వేల రూపాయల జీతం వస్తోంది. అయినా సరే .. ఆమె టాయిలెట్‌లో అద్దెకు ఉంటోంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెను తిడుతున్నారు. అంత డబ్బు వస్తుంటే ఆ పాడు పనేంటి అంటూ మండిపడుతున్నారు.

పాపం.. యువతి విచిత్ర జీవితం.. టాయిలెట్‌‌లొ అద్దెకు..
Chinese Woman Lives In Toilet

ఆర్థిక ఇబ్బందులు మనుషుల్ని ఎంత కృంగదీస్తాయో.. ఎంత ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంపాదన సరిగా లేనపుడు ఉన్న దాంట్లోనే సర్ధుకోవాల్సి వస్తుంది. బిర్యానీ తినే చోట అన్నం, పప్పుతో సరి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక వేళ సొంతిళ్లు లేదనుకోండి.. ఇంటి అద్దె విషయంలోనూ ఆలోచించాల్సి వస్తుంది. స్థోమతను బట్టి పూరి గుడిసెలో కూడా బతికాల్సి వస్తుంది. పూరి గుడిసైనా నయం.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలోని అమ్మాయి.. ఆర్థిక స్థోమత సరిగా లేక టాయిలెట్‌లో అద్దెకు ఉంటోంది. అది కూడా తను పని చేసే ఆఫీస్ టాయిలెట్‌లో అద్దెకు ఉంటోంది. ఈ సంఘటన చైనాలో ఆసల్యంగా వెలుగు చూసింది. ఇక, పూర్తి వివరాల్లోకి వెళితే..


చైనాలోని హ్యూబే ప్రావిన్స్‌కు చెందిన యాంగ్ అనే యువతికి 18 ఏళ్లు. ఆమె ఓ కంపెనీలో 2,700 యాన్లకు పని చేస్తోంది. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఆమె జీతం 31 వేల రూపాయలు. 31 వేల జీతంతో ఇంటిని రెంటుకు తీసుకోవటం ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని ఆమె భావించింది. దీంతో ఆఫీస్‌లోని టాయిలెట్‌లో తక్కువ మొత్తానికే అద్దెకు చేరింది. ఆ టాయిలెట్‌లో ఉండటం కోసం ప్రతీ నెలా 600 రూపాయలు చెల్లిస్తోంది. ఆ టాయిలెట్‌లోనే అన్ని పనులు చేస్తుంది. అక్కడే నేలపై నిద్రపోతుంది. అదే ఆమె ఇళ్లుగా మారిపోయింది. టాయిలెట్ ఇంటికి సంబంధించిన వీడియోను యాంగ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ‘ టాయిలెట్‌లో ఒంటరిగా జీవించటం భయంగా లేదు.


ఆఫీస్‌లో 24 గంటల సర్వేలెన్స్ ఉంటుంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను సేఫ్‌గా ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో.. టాయిలెట్‌లోని ఇండియన్ కమోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యాంగ్ టాయిలెట్‌లో అద్దెకు ఉండటంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆమె పరిస్థితి చూసి అయ్యో పాపం అంటున్నారు. మరికొందరు మాత్రం తిడుతున్నారు. ‘ నెలకు 31 వేల రూపాయలు సంపాదిస్తున్నావు. ఓ మంచి ఇంట్లో ఉండలేవా?.. ఏంటి ఈ కర్మ’.. ‘ డబ్బులు మిగుల్చుకోవడానికి ఈ చెత్త పనులన్నీ చేస్తోంది’.. ‘ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలా మరుగుదొడ్డిలో చావాలా?..’ అంటూ మండిపడుతున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

ఇవి కూడా చదవండి:

పొట్టు పొట్టు కొట్టుకున్నారు

Hardik Pandya: కుర్రాడితో హార్దిక్ కొట్లాట.. బూతులు తిడుతూ..

Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..

Updated Date - Mar 30 , 2025 | 04:35 PM