Viral Video: స్విమ్మింగ్‌పూల్లో అలజడి.. గజ గజ వణికిన ప్రేమ జంట
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:55 PM
మయన్మార్‌లో ఆదివారం మరో సారి భూకంపం వచ్చింది. ప్రాణ భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇప్పటికే అక్కడ 1,664 మంది మరణించగా.. 3,408 మంది గాయపడ్డారు. నిత్యావసర ధరలు కొండెక్కాయి. ప్రతీది భారీ ధర పలుకుతున్నాయి.

మయాన్మార్, బ్యాంకాక్‌లలో భారీ భూకంపాలు విలయాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా 1,664 మంది మరణించగా.. 3,408 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడ్డవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో భూకంపం తాలూకా వీడియోలు వైరల్‌గా మారాయి. బ్యాంకాక్‌లో భూకంపం సందర్భంగా ఓ పెద్ద బిల్డింగ్ మీద నుంచి నీళ్లు ఎగిసిపడుతున్న దృశ్యాల తాలూకా వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మనకు నీళ్లు పైనుంచి ఎగిసిపడుతున్నట్లు మాత్రమే కనిపిస్తుంది. పైన ఏం జరిగిందో తెలీదు. ప్రస్తుతం పైన ఏం జరిగిందో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియో ప్రకారం.. బిల్డింగ్‌పైన ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది.
ఆ పూల్‌లో ఓ జంట.. నీటిపై తేలియాడే బెడ్‌షీట్‌పై పడుకుని ఉంది. ఆ ప్రేమికులు ఒకరి ఒడిలో ఒకరు సేద తీరుతున్నారు. కొద్దిసేపటి తర్వాత అలజడి మొదలైంది. వారు మెల్లగా మైకంలోంచి బయటకు వచ్చారు. మొదట వారికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. స్విమ్మింగ్‌పూల్‌లోని నీళ్లు పెద్ద పెద్ద అలలుగా కిందకు ఎగిసిపడ్డం మొదలైంది. వెంటనే వాళ్లు అక్కడినుంచి పైకి వచ్చేశారు. స్విమ్మింగ్‌పూల్‌లోని నీళ్లు పైన ఉన్న వాళ్లపైకి కూడా సముద్రపు అలల్లాగా ఎగసిపడ్డాయి. నీటిపై తేలుతున్న బెడ్‌షీట్లు రెండు పైనుంచి కిందకు పడిపోయాయి. ఒకవేళ ఆ ప్రేమ జంట వాటిపైనే ఉండిఉంటే.. పైనుంచి కిందకు పడేది. ఒక నిమిషం నిడివి ఉన్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మరో భూంకంపం
వరుస భూకంపాలతో మయన్మార్ అల్లాడిపోతోంది. మొన్న ఒకే సారి రెండు భూకంపాలు వచ్చి.. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అన్ని రకాలుగా మయన్మార్ కుదేలు అయిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. ఆదివారం మరోసారి భూమి కంపించింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదు అయింది. భూమి కంపించటంతో జనం భయంతో ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియ కంటిమీద కునుకులేకుండా ఉన్నారు. ఇక, మయన్మార్‌లో నిత్యావసర ధరలు కొండెక్కాయి. ప్రతీది భారీ ధర పలుకుతున్నాయి. జనం కూడా తినడానికి తిండి ఇబ్బందిపడుతున్నారు. ఆఖరికి నీళ్ల విషయంలోనూ ఇబ్బందిగా ఉంది.
ఇవి కూడా చదవండి:
Kamakhya Express Derail: పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్
Special weekly train: అనంతపురం మీదుగా ప్రత్యేక రైలు..