Shane Warne: ప్రముఖ స్టార్ క్రికెటర్ మృతి..వెలుగులోకి కొత్త విషయాలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 06:18 PM
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆస్ట్రేలియాన్ క్రికెటర్ షేన్ వార్న్, 2022 మార్చి 4న థాయిలాండ్‌లో గుండెపోటుతో మరణించారు. కానీ తాజాగా ఆయన మృతి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రముఖ ఆస్ట్రేలియాన్ క్రికెటర్ షేన్ వార్న్(52)(Shane Warne) థాయిలాండ్‌లో ఓ విల్లాలో తన స్నేహితులతో ఉన్న క్రమంలో గుండెపోటుతో 2022 మార్చి 4న మరణించాడని అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం ఈ కేసు విషయంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, వార్న్ మరణానికి గుండెపోటు మాత్రమే కారణం కాదని అంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ పోలీస్ అధికారి దీనికి సంబంధించి అనేక విషయాలను బయటపెట్టారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఓ పోలీసు అధికారి ఒక ప్యాటిల్ కమాగ్రా బాటిల్, రక్తం, వాంతుల మచ్చలు కనిపించాయని తెలిపారు. ఈ విషయాలు ఆయన మరణం గురించి అనేక సందేహాలను కలిగిస్తున్నాయి. అయితే, కొద్ది సేపటికి ప్యాటిల్ సీసా తొలగించాలని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన అన్నారు. కమాగ్రా అనేది అంగస్తంభన చికిత్సలలో ఉపయోగించే ఔషధం. ఈ ఔషధంలో సిల్డెనాఫిల్ సిట్రేట్ ఉంది, ఇది వయాగ్రాలో కూడా కనిపించే పదార్థం.
ఆ క్రమంలో డైలీ మెయిల్‌తో మాట్లాడిన పోలీసు అధికారి, సీనియర్ అధికారులు ఆ మాత్రల సీసాను తొలగించమని ఆదేశించారని వెల్లడించారు. ఈ కేసులో ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. షేన్ వార్న్ మరణం గురించి అధికారిక నివేదికలో గుండెపోటు కారణంగా మరణించాడని, కానీ దానికి సంబంధించిన ఇతర వివరాలు లేవని తెలుస్తోంది. మరోవైపు కామాగ్రా గురించి ఎవరు ప్రస్తావించలేదు. ఇది కీలకమైన అంశంగా మిగిలిపోయింది. అయితే దీనిని తీసుకున్నాడా లేదా అనేది తెలియలేదు.
షేన్ వార్న్, తన స్నేహితులతో కలిసి హాలిడే సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మరణం తర్వాత థాని ఆసుపత్రి అందించిన శవపరీక్షలో, వార్న్ సహజ కారణాల వల్ల మరణించాడని, ఎటువంటి అక్రమ సంబంధం లేదన్నారు. అయినప్పటికీ ఈ ఘటనపై ఇంకా అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. షేన్ వార్న్ లాంటి ప్రముఖ వ్యక్తి మరణం, కేవలం గుండెపోటుతోనే జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News