Share News

Myanmar Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:44 PM

మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.

Myanmar Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

ఇంటర్నెట్ డెస్క్: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. మెుదటగా శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూ విలయం మయన్మార్‌ను కుదిపేసింది. శక్తిమంతమైన భూకంపం ధాటికి 1,664 మంది ప్రాణాలు కోల్పోగా.. 3,408 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.


కొండ ప్రాంతాలు, రెబల్స్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరణాలను అధికారులు ఇంకా లెక్కించలేదు. వాటినీ పరిగణనలోకి తీసుకుంటే మృతుల సంఖ్య ఏకంగా 10 వేలు దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే(యూఎస్జీఎస్‌) వెల్లడించింది. మయన్మార్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం పడింది. పదుల కొద్దీ భవంతులు నెలమట్టం అయ్యాయి. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. భవనాలు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


కాగా, ఆదివారం ఉదయం ఇండోనేషియాలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్ర దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Tirupati: తిరుపతి కిడ్నాప్ కేసు.. వెలుగు చూసిన సంచలన విషయాలు..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

Updated Date - Mar 30 , 2025 | 02:05 PM