
RR vs CSK Match Live Updates: ఆరంభంలోనే షాక్..
ABN , First Publish Date - Mar 30 , 2025 | 07:44 PM
RR vs CSK IPL 2025 Live Updates in Telugu: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లాస్ట్ మ్యాచ్‌లో ఓటమి చెందిన ఈ రెండు పార్టీ గెలుపు కోసం పట్టుదలతో ఉన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..

Live News & Update
-
2025-03-30T21:49:24+05:30
ఛేజింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది.
ఓపెనర్ రచిన్ రవీంద్ర డకౌట్ అయ్యాడు.
పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ ధృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు రచిన్.
సీఎస్‌కే స్కోరు 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (3 నాటౌట్)తో పాటు రాహుల్ త్రిపాఠి (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
-
2025-03-30T21:21:06+05:30
రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసిందా టీమ్.
నితీష్ రాణా (81) టాప్ స్కోరర్.
చెన్నై బౌలర్లలో పతిరానా, నూర్, ఖలీల్ చెరో 2 వికెట్లు తీశారు.
-
2025-03-30T21:05:30+05:30
రాజస్థాన్ ఇంకో వికెట్ కోల్పోయింది. ఆ టీమ్ కెప్టెన్ రియాన్ పరాగ్ (37) ఔట్ అయ్యాడు.
మతీష పత్తిరానా బౌలింగ్‌లో యార్కర్‌ను ఎదుర్కోబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు పరాగ్.
రాజస్థాన్ ప్రస్తుతం 18 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 173 పరుగులతో ఉంది.
-
2025-03-30T20:48:39+05:30
రాజస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది.
6వ డౌన్‌లో వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ (4) ఔట్ అయ్యాడు.
పర్పుల్ క్యాప్ హోల్డర్ నూర్ అహ్మద్ అతడ్ని పెవిలియన్‌కు పంపించాడు.
-
2025-03-30T20:33:23+05:30
ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోతున్న నితీష్ రాణా (36 బంతుల్లో 81) ఔట్ అయ్యాడు.
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు రాణా.
అశ్విన్ ప్లాన్ ప్రకారమే బంతిని దూరంగా వేశాడు. ధోని కూడా ముందే వికెట్లకు దూరంగా నిలబడ్డాడు. ఇది తెలియని నితీష్ ముందుకొచ్చి బంతిని మిస్ అవడం, మాహీ స్టంప్స్ ఎగరేయడం రెప్పపాటులో జరిగిపోయాయి.
-
2025-03-30T20:12:29+05:30
దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి.
ఆ టీమ్ ఓపెనర్ సంజూ శాంసన్ (16 బంతుల్లో 20)ను ఔట్ అయ్యాడు.
స్పిన్నర్ నూర్ అహ్మద్ సంజూను పెవిలియన్‌కు పంపించాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 87.
-
2025-03-30T20:09:03+05:30
రాజస్థాన్ సీనియర్ బ్యాటర్ నితీష్ రాణా చెలరేగిపోతున్నాడు.
21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు నితీష్.
ఈ ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు కొట్టిన లెఫ్టాండ్ బ్యాటర్.. 4 సిక్సులు బాదాడు.
-
2025-03-30T19:46:47+05:30
ఫస్ట్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్..
-
2025-03-30T19:44:34+05:30
IPL 2025 RR vs CSK Match Live Updates in Telugu: రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌ని మొదటి నుంచే కట్టడి చేస్తోంది.