Currency Crisis: దారుణం, కుప్పకూలిన కరెన్సీ.. ఒక డాలరుకు 10,43,000 రియాల్స్..
ABN , Publish Date - Apr 05 , 2025 | 08:14 PM
ఇరాన్ దేశ కరెన్సీ, రియాల్, మరోసారి భయానకంగా పతనమైంది. శనివారం, ఏప్రిల్ 5న, ఒక డాలర్‌కు రియాల్ విలువ 10,43,000కి చేరుకోవడం చరిత్రలోనే ఆల్ టైం కనిష్ట రికార్డు. ఈ కరెన్సీ పతనం ఇరానియన్ల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

ఇరాన్ దేశ కరెన్సీ(Iran Currency Collapses) రియాల్ మళ్లీ దారుణంగా పడిపోయింది. ఎంతలా అంటే శనివారం (ఏప్రిల్ 5న) ఇరాన్‌లో ఒక డాలర్‌తో పోలిస్తే రియాల్ 10,43,000కు చేరుకుంది. ఇది చరిత్రలోనే ఆల్ టైం రికార్డుగా నిలిచింది. మరోవైపు ఈ కరెన్సీ పతనం ఇరాన్ ప్రజల జీవితాలపై భారీగా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ద్రవ్య మార్పిడి సహా కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున పౌరులపై ప్రభావం చూపిస్తుంది. ఇరాన్ ప్రజలు ఇప్పుడు తమ ఆర్థిక భవిష్యత్తును, అవసరాలను తీర్చుకోవడంలో భారీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అనేక మంది వ్యాపారులు సైతం నగదు బదిలీని నిలిపివేశారు. ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు.
ప్రధాన కారణం..
ఇరాన్ కరెన్సీ రియాల్‌పై ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం మార్కెట్లో తగ్గిన చమురు అమ్మకాలు. ప్రపంచంలోని ఇతర దేశాలతో సహకారం లేకపోవడం. సుదీర్ఘంగా అమెరికా వాణిజ్య ఆంక్షలు, ఇరాన్ అణు విధానాలు, యుద్ధాల కారణంగా మార్కెట్లో అస్థిరత అధికంగా ఉంది. దీంతో ప్రజల జీవితాల్లో సంక్షోభం మరింతగా పెరుగుతోంది. విదేశీ ఒత్తిళ్లు, దేశీయ ఆర్థిక విధానాలపై ఆరోపణలు, ప్రభుత్వ నిర్ణయాలు వీటిని మరింత పెంచుతున్నాయి. ఇరాన్‌లోని ప్రజలు తమ పొదుపును కాపాడుకునేందుకు క్రిప్టోకరెన్సీ, ఇతర కొత్త ఆర్థిక వనరులను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ప్రభావం కూడా..
ఇరాన్‌లో వృద్ధి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ధరలు పడిపోవడం అనేది అనేక వర్గాల ప్రజలకు మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. ఇటీవల, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ సలహా ఇచ్చారు. సౌకర్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే తమ పొరుగువారితో మంచి సంబంధాలను కలిగి ఉండాలని హితవు పలికారు. మరోవైపు ఇరాన్‌లో రాజకీయ సంక్షోభం కూడా మితిమీరిన స్థాయిలో ఉంది. హిజాబ్ నియమాలను పాటించలేదనే కారణంగా మహిళల నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యంగా పెట్రోల్ ధరల పెంపు వంటి అంశాలు ఇప్పటికే ఆందోళనలకు కారణమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రజలపై పడిన ఆర్థిక సంక్షోభంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ నిర్ణయాలే కారణమా..
2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు ఒప్పందం నుంచి విడిపోయారు. ఆ తర్వాత ఇరాన్ మీద కఠినమైన ఆంక్షలు విధించడంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. అప్పుడు ఇరాన్ కరెన్సీ రియాల్.. అమెరికా డాలర్‌తో పోల్చితే 32,000 స్థాయిలో ఉండేది. అప్పటి నుంచి ఆంక్షల వల్ల ఇరాన్ వాణిజ్య, చమురు ఎగుమతుల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి.
ఫలితంగా రియాల్ విలువ పతనమయ్యింది. అమెరికా చర్యల కారణంగా ఈ కరెన్సీ విలువ మరింత పడిపోయింది. కానీ 2021లో బైడెన్ పరిపాలనలో ఇరాన్‌తో ప్రత్యక్ష చర్చలు ప్రారంభం కాలేదు. ఇరాన్ వ్యూహాలపై అమెరికా క్రియాశీల చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇరాన్ చైనా సహా ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి:
BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News