Viral Video: అతడ్ని చూసి పరుగులు పెట్టిన మొసళ్లు.. వీడియో మామూలుగా ఉండదు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:50 PM
మనుషుల్ని బయపెట్టే మొసళ్లనే ఓ వ్యక్తి పరుగులు పెట్టించాడు. అతడినుంచి తప్పించుకుని ఆ మొసళ్లు నీటిలోకి పరుగులు పెట్టాయి. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 50కిపైగా మొసళ్లను అతడు గజగజలాడించాడు.

సాధారణంగా మొసళ్లంటే జనాలకు చచ్చేంత భయం ఉంటుంది. ఒకసారి వాటి నోటికి చిక్కామంటే ప్రాణాలు పోవడమో.. అవిటివాళ్లం అవ్వడమో తప్పదు. అందుకే మొసళ్లు ఉన్న నీటి చుట్టు పక్కలకు కూడా ఎవరూ వెళ్లరు. కానీ, ఓ వ్యక్తి మాత్రం మొసళ్లను భయపెట్టాడు. అతడి దెబ్బకు అవి పరుగులు పెట్టాయి. చల్లగా నీటిలోకి జారుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ నీటి కొలను గట్టు మీద పెద్ద సంఖ్యలో మొసళ్లు సేద తీరుతూ ఉన్నాయి. ఓ వ్యక్తి పార తీసుకుని గట్టు మీదకు వచ్చాడు. వేగంగా పరిగెత్తుతూ .. గట్టు మీద ఉన్న మొసళ్లను భయపెట్టాడు. ఆ వ్యక్తి చేతిలో ఉన్న పారను చూసి ఆ మొసళ్లు పరుగు, పరుగున నీటిలోకి దూకేశాయి. కొన్ని మొసళ్లు అతడిపైకి ఎదురు తిరిగాయి. అంతే.. ఆ వ్యక్తి పారతో వాటి మూతిపై టప్‌మని కొట్టాడు. ఆ దెబ్బకు అవి నీటిలోకి పరిగెత్తాయి.
దాదాపు 50కిపైగా మొసళ్లను అతడు నీటిలోకి తరిమేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అతడి దగ్గర ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. లక్షల సంఖ్యలో వ్యూస్ తెచ్చుకుంది. వేల సంఖ్యలో జనం దానిపై స్పందిస్తున్నారు. ‘ అది మీరు అనుకున్నంత ఫన్నీగా ఏం లేదు. అతడు వాటిని హింస్తున్నాడు. ప్రతీ రోజు వాటిని కొడుతున్నాడు’..‘ మీకు ఓ విషయం తెలుసా?.. ఆ పారలను మొసళ్లను కొట్టడానికే తయారు చేశారు. వాటిని ‘గేటర్ వేకర్స్’అని అంటారు. కొంతమంది దాన్ని గుంతలు తవ్వడానికి ఉపయోగిస్తున్నారు’.. ‘ మొసళ్లను కొడుతున్నాడు బానే ఉంది. కొద్దిగా అదుపు తప్పినా అతడి పరిస్థితి ఏంటి?.. నిమిషాల్లో ఎముకలు కూడా మిగలకుండా మొసళ్లు తినేస్తాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో తెలీదు. ఈ వీడియో పాతదిలా కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది.
గేదె.. కొమోడో ఫైట్..
మరో సంఘటనలో గేదె, కొమోడో డ్రాగన్‌లు ఒకదానిపై ఒకటి గొడవకు దిగాయి. ఓ చోట పచ్చిక మైదానంలో కొన్ని గేదెలు గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఓ కొమోడో డ్రాగన్ వచ్చింది. వేట కోసం వెతుకుతూ ఉంది. కొమోడోను చూడగానే అక్కడి గేదెలు అప్రమత్తం అయ్యాయి. ఓ గేదె దాన్ని అక్కడినుంచి తరిమి కొట్టింది. కొమోడో కొంత దూరం పరిగెత్తి ఆగిపోయింది. ఏమనుకుందో ఏమో తెలీదు కానీ, గేదెపై తిరగబడింది. గేదెను కొరకడానికి ప్రయత్నించింది. గేదె మాత్రం అత్యంత చాక చక్యంగా దాన్నుంచి తప్పించుకుంది. కొమ్ములతో కొమోడో మూతిపై కొట్టింది. దీంతో కొమోడో పక్కకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..