Ukraine: జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:52 AM
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరమైన క్రైవి రిపై రష్యా క్షిపణి దాడులు జరిపి 9 మంది చిన్నారులతో సహా 18 మంది మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందం మధ్య에도 దాడులు కొనసాగించడమే రష్యా యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదని నిరూపిస్తోందని జెలెన్‌స్కీ అన్నారు.

9 మంది చిన్నారులు సహా 18 మంది మృతి
యుద్ధాన్ని ఆపే ఆలోచన రష్యాకు లేదన్న జెలెన్‌స్కీ
కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన రష్యా
కీవ్, ఏప్రిల్ 5: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రైవి రిపై రష్యా జరిపిన దాడిలో 9 మంది చిన్నారులు సహా 18 మంది చనిపోయారు. 61 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సాధారణ జనావాసాలే లక్ష్యంగా క్షిపణి దాడులు జరిపారని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఎక్కడ దాడులు జరుపుతున్నామనేది తెలిసే రష్యా దాడులు జరిపిందన్నారు. యుద్ధాన్ని ఆపే ఆలోచన రష్యాకు లేదనే విషయం ఈ దాడితో తేటతెల్లమైందన్నారు. అమెరికా, యూరప్, ఇతర దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపేలా చూడాలని జెలెన్‌స్కీ కోరారు. మరోవైపు తమ దాడిలో 85 మంది ఉక్రెయిన్ సైనికులు హతమయ్యారని రష్యా ప్రకటించుకుంది. అమెరికా ప్రతిపాదించిన నెల రోజుల కాల్పుల విరమణకు రష్యా-ఉక్రెయిన్ అంగీకరించినా దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడితో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా తుంగలో తొక్కినట్లైంది.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News