Share News

TV: టీవీ వచ్చాక మొదటి యాడ్.. భలే తమాషాగా ఉంది..

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:50 PM

మన చిన్నపుడు టీవీలు చూస్తుంటే సడెన్‌గా యాడ్లు వచ్చేవి. అవిరాగానే సుత్తి వచ్చిందని తిట్టుకునే వాళ్లం. అసలు భారత దేశంలో మొదటి సుత్తి ఎప్పుడు ప్రసారం అయిందో తెలుసా?.. ఆ సుత్తిని దేని మీద చేశారో తెలుసా?..

TV: టీవీ వచ్చాక మొదటి యాడ్.. భలే తమాషాగా ఉంది..
Doordarshan

ఇప్పడంటే అందరూ మొబైల్ ఫోన్లలో బిజీ అయిపోయారు. టీవీలు చూడటం బాగా తగ్గించేశారు. కానీ, ఒకప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది. వినోదం అంటే మొదటగా టీవీనే గుర్తుకు వచ్చేది. గంటలు, గంటలు టీవీల ముందు కూర్చుని కాలక్షేపం చేసేవారు. మధ్య మధ్యలో యాడ్లు వచ్చేవి. అవి వచ్చిన ప్రతీసారి తిట్టుకునే వారు. తెలుగు వారు యాడ్లకు సుత్తి అనే పేరు కూడా పెట్టుకున్నారు. మనం చిన్నపుడు చూసిన టీవీ యాడ్లలో మనకు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తిండిపోయేవి.. వాషింగ్ పౌడర్ నిర్మా, జండూబామ్, డాబర్ రెడ్ పౌడర్, బూమర్, గోల్డ్ స్పాట్... అసలు టీవీ యాడ్లు ఇండియాలో ఎప్పుడు మొదలయ్యాయో మీకు తెలుసా? ఇండియాలో దూరదర్శన్ మొదలైన తర్వాత మొదటి యాడ్ దేని మీద చేశారో తెలుసా?..


మొదటి టీవీ యాడ్ ఇదే..

1959, సెప్టెంబర్ 15వ తేదీన దూరదర్శన్ ప్రారంభం అయింది. 1967, జనవరి 26వ తేదీన కృషీ దర్శన్ అనే ప్రోగ్రామ్ మొదలైంది. దూరదర్శన్‌లో ఇదే పొడవైన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కారణంగా ఎంతో మంది రైతులు లాభపడ్డారు. సరిగ్గా పదేళ్ల తర్వాత మొదటి టీవీ యాడ్ ప్రసారం అయింది. 1976,జనవరి 1వ తేదీన దూరదర్శన్‌లో గ్వాలియర్ షూటింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ యాడ్ వచ్చింది. 1982లో ఇండియాలో కలర్ టీవీలు ప్రారంభం అయ్యాయి. కలర్ టీవీలు వచ్చిన తర్వాత బాంబే డైయింగ్ యాడ్ ప్రసారం అయింది. తర్వాతి నుంచి యాడ్లకు పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు చాలా రకాల మాధ్యమాలు అందుబాటులో ఉండటంతో టీవీల ఆదాయం పడిపోయింది.


ఇప్పుడంతా సోషల్ మీడియా..

ఇంటర్‌నెట్ వాడకం పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా పరిధి కూడా బాగా పెరిగింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వటం కారణంగా జనం గంటలు, గంటలు సోషల్ మీడియలోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఇన్‌ఫ్లుయెన్సర్లు వెలుగులోకి వస్తున్నారు. వారి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ప్రమోషన్ల కోసం వారినే ఆశ్రయిస్తున్నాయి. ఫాలోయింగ్‌ను బట్టి వేలు, లక్షలు, కోట్లు కూడా ఇచ్చి తమ ప్రాడెక్టును ప్రమోట్ చేయించుకుంటున్నాయి. ఆఖరికి సినిమా ప్రమోషన్లకు కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆశ్రయిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 20 , 2025 | 06:14 PM