Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:58 PM
బిజీ రోడ్ల మీద వాహనాలు ఒకదానినొకటి రాసుకున్నప్పుడు, ట్రాఫిక్‌లో అడ్డంగా ఉన్నప్పుడు గొడవలు జరుగుతుంటాయి. రోడ్డు మీదే వాహనాల మీద నుంచి కిందకు దిగి కొట్టుకున్న సందర్భాలు కూడా చూస్తుంటాం. తాజాగా అలాగే జరిగింది. ఓ బైకర్ చేసిన పని బస్సు డ్రైవర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

సాధారణంగా బిజీ రోడ్ల (Roads) మీద ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు. ముఖ్యంగా వాహనాలు ఒకదానినొకటి రాసుకున్నప్పుడు, ట్రాఫిక్ (Traffic)లో అడ్డంగా ఉన్నప్పుడు గొడవలు జరుగుతుంటాయి. రోడ్డు మీదే వాహనాల మీద నుంచి కిందకు దిగి కొట్టుకున్న సందర్భాలు కూడా చూస్తుంటాం. తాజాగా అలాగే జరిగింది. ఓ బైకర్ చేసిన పని బస్సు డ్రైవర్ (Bus driver)కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడు చేసిన పని అందరినీ నివ్వెరపరిచింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
@gharkekalesh అనే ట్విటర్ హ్యాండల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక బైకర్ రోడ్డు మీద ఆగి ఉన్న బస్సు తలుపు తెరిచి డ్రైవర్‌తో గొడవ పడుతున్నాడు. డ్రైవర్ చేయి పట్టుకుని దాడి చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆ బస్సు డ్రైవర్ తన చేతిని విడిపించుని సీటు నుంచి పైకి లేచాడు. సీటు వెనుక తగిలించిన తన బ్యాగ్, బైక్ హెల్మెట్ తీసుకొని బస్సు నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత బస్సును రోడ్డుపై వదిలేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న అందరూ షాకైపోయారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 10 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అతడికి గొడవలు ఇష్టం ఉండవేమో, చాలా ప్రశాంతమైన వ్యక్తి అని ఒకరు కామెంట్ చేశారు. ఆ డ్రైవర్ చాలా సరైన పని చేశాడు అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..
IQ Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ట్యాంకుల్లో ముందుగా ఏది నిండుతుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..