Share News

Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది

ABN , Publish Date - Mar 20 , 2025 | 07:10 PM

Marri Rajasekhar: వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పెదవి విప్పారు. తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ వల్ల ఎలా బాధపడింది ఆయన చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ జగన్‌కు మర్రి రాజశేఖర్ థ్యాంక్స్ చెప్పారు.

Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది
RajaSekhar Marri

చిలకలూరిపేట, మార్చి 20: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రతిసారి తనకు మాట ఇచ్చి.. తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడం తనను తీవ్రంగా బాధించిందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ విలేకర్లతో మాట్లాడుతూ.. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. 2019లో తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే విషయాన్ని బహిరంగంగా సభలో సైతం వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సైతం తాను పని చేశానన్నారు. అంతేకాదు.. వైసీపీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


అయితే 53 వేల ఓట్లతో ఓడిపోయిన వారికి ఇక్కడ ఇన్‌ఛార్జ్ ఇవ్వడం తనకు అర్థం కానీ విషయమని ఆయన పేర్కొన్నారు. తనకు ఇన్‌ఛార్జ్ ఇస్తామని చెప్పి మళ్లీ గుంటూరులో ఓడిపోయిన వాళ్లను తీసుకు వచ్చి.. ఇక్కడ ఎందుకు ఇన్‌ఛార్జీ ఇచ్చారో తనకు తెలియదన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అభిమానంతో నాడు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని మర్రి రాజశేఖర్ తెలిపారు. నాలుగు సంవత్సరాలు అధికారం వదులుకొని జగన్ కోసం పార్టీ మారిన తనను వైఎస్ జగన్ గుర్తించలేదన్నారు. వైసీపీకి మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా చేసిన విషయం విధితమే.


గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టింది. ఈ ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో వైసీపీలోని పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. ఆ క్రమంలో మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. అయితే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్ ఆకస్మిక మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీ స్థాపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు.. జగన్ పార్టీలో చేరారు.


అలా మర్రి రాజశేఖర్ సైతం ఆ పార్టీలో చేరారు. ఆ నాటి నుంచి ఆయన ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ ఆయనకు కేవలం ఎమ్మెల్సీ స్థానాన్ని మాత్రమే కేటాయించారు. అదీకాక.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి విడదల రజినీని మళ్లీ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్.. వైసీపీకి రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు.

Also Read:

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

Nirmala Sitharaman: ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే...

CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..

Toothpick: టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేస్తే.. ఇంత డేంజరా?

Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు

Badar Khan Suri : అమెరికాలో భారతీయుడిపై బహిష్కరణ వేటు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 20 , 2025 | 07:59 PM

News Hub