Share News

Okami Dog: ఈ కుక్క ఖరీదు జస్ట్ రూ.50 కోట్లు.. పోషించాలంటే మినిమమ్ కోటీశ్వరుడై ఉండాలి..

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:21 PM

బెంగళూరుకు చెందిన సతీష్ అనే బ్రీడర్ ఏకంగా రూ.50 కోట్లు పెట్టి ఓ కుక్కను కొన్నాడు. ఆ కుక్క బ్రీడ్ పేరు ఒకామీ. ఇది తోడేలుకు, మంచు ప్రాంతాలకు చెందిన కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కకు పుట్టిన క్రాస్ బ్రీడ్. ఇలాంటి క్రాస్ బ్రీడ్ ద్వారా పుట్టిన తొలి కుక్క ఇదేనట. దీనిని కొనడానికే కాదు.. పోషించాలన్నా కోట్లు ఖర్చు పెట్టాల్సిందే.

Okami Dog: ఈ కుక్క ఖరీదు జస్ట్ రూ.50 కోట్లు.. పోషించాలంటే మినిమమ్ కోటీశ్వరుడై ఉండాలి..
Most expensive wolfdog

ఎంత ధనవంతులైనా పెంపుడు కుక్క కోసం ఎంత ఖర్చు పెడతారు. మహా అయితే లక్షలు, వేలు పెట్టి కుక్క పిల్లలను కొంటుంటారు. అరుదైన జాతికి చెందిన కుక్క అయితే ఒక కోటో, రెండో కోట్లో పెడతారు. అయితే బెంగళూరుకు చెందిన సతీష్ అనే బ్రీడర్ మాత్రం ఏకంగా రూ.50 కోట్లు పెట్టి ఓ కుక్కను కొన్నాడు. ఆ కుక్క బ్రీడ్ పేరు ఒకామీ (Okami Dog). ఇది తోడేలుకు, మంచు ప్రాంతాలకు చెందిన కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కకు పుట్టిన క్రాస్ బ్రీడ్. ఇలాంటి క్రాస్ బ్రీడ్ ద్వారా పుట్టిన తొలి కుక్క ఇదేనట. దీనిని కొనడానికే కాదు.. పోషించాలన్నా కోట్లు ఖర్చు పెట్టాల్సిందే (Most expensive wolfdog).


శీతల దేశాలకు చెందిన కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కలు అత్యంత బలంగా ఉంటాయి. ఇవి గొర్రెల మందను తోడేళ్ల నుంచి కాపాడుతుంటాయి. తోడేళ్లతో భీకరంగా పోరాడతాయి. అలాంటి రెండు బలమైన జాతులకు చెందిన జీవులకు పుట్టినదే ఒకామీ డాగ్‌. అమెరికాలో ఈ కుక్క పుట్టింది. బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఆ అరుదైన బ్రీడ్‌కు చెందిన కుక్కను కొని ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ డాగ్ వయసు కేవలం 8 నెలలు. ఆ వయసుకే ఆ కుక్క బరువు మాత్రం 75 కిలోలు ఉంది. దీనికి రోజుకు కనీసం మూడు కిలలో చికెన్ అయినా ఉండాలట. ఇక, అదనపు పోషకాలు, సంరక్షణ సంగతి సరేసరి.


బెంగళూరుకు చెందిన సతీష్ దగ్గర ప్రస్తుతం 150 రకాల జాతులకు చెందిన కుక్కలు ఉన్నాయట. ఆయన తన ఏడు ఎకరాల ఫామ్‌హౌస్‌లో ఈ శునకాలను ఉంచి సంరక్షిస్తుంటాడు. ఆయా కుక్కలను వివిధ వేదికలపై ప్రదర్శించి కోట్లు సంపాదిస్తుంటాడు. ముప్పై నిమిషాల పాటు ఆ కుక్కలతో ప్రదర్శన ఇచ్చి రూ.25 వేలు తీసుకుంటాడు. గతేడాది కూడా అతడు చౌచౌ జాతికి చెందిన చింపాంజీ లాంటి కుక్కను రూ.29 కోట్లకు కొన్నాడు. అరుదైన కుక్కలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారని, వాటితో కేవలం సెల్ఫీ తీసుకునేందుకు లక్షల్లో ఖర్చు పెట్టేవారు ఉన్నారని సతీష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..


Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..


IQ Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ట్యాంకుల్లో ముందుగా ఏది నిండుతుందో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2025 | 05:21 PM