DMK Leaders: హిందీపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు.. డీఎంకే నేతల రియాక్షన్
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:59 PM
హిందీ భాషా వివాదం క్రమంగా ముదురుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నేతలు తీవ్రంగా స్పందించారు. అయితే ఏం అన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో హిందీ భాషా వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై డీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. ఈ క్రమంలో తమిళనాడు ఎప్పుడూ హిందీని వ్యతిరేకించినట్టు కాదని, మేము వ్యతిరేకించేది ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా రూద్దొద్దని డాక్టర్ హఫీజుల్లా అన్నారు. తమిళనాడు సుదీర్ఘ కాలంగా హిందీకి బలవంతపు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోందన్నారు.
అవగాహన లేనట్లు..
ఈ నేపథ్యంలో భాషా విధానం, విద్యలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను ప్రోత్సహించేందుకు డీఎంకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జాతీయ విద్యా విధానం(NEP) ద్వారా కేంద్రం హిందీని ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తోందని, అయితే తాము దీన్ని నిరంతరం వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. హిందీని స్వేచ్ఛగా నేర్చుకోవాలనుకునే వారికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమిళనాడు భాషా విధానంపై పవన్ కల్యాణ్‌కు సరైన అవగాహన లేనట్లు ఉందన్నారు.
ఎలాంటి అడ్డంకులు లేవు..
తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయడం వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమేనని డీఎంకే నాయకులు అన్నారు. మూవీలు డబ్బింగ్ చేయడం ఒక వ్యాపార నిర్ణయం. కానీ భాషా విధానం ఒక సామాజిక, రాజకీయ అంశం. వీటిని కలిపి చూడటం తగదని హఫీజుల్లా స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇష్టంతో హిందీ నేర్చుకోవాలనుకుంటే వారికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. కానీ, ప్రభుత్వం అనుసరించాల్సిన భాషా విధానం వేరుగా ఉంటుందని డీఎంకే తెలిపింది.
హిందీకి వ్యతిరేకంగా..
సీనియర్ డీఎంకే నాయకుడు టికెఎస్ ఎలంగోవన్ మాట్లాడుతూ తమిళనాడు భాషా విధానం చాలా కాలంగా స్థిరంగా ఉందని చెప్పారు. 1938 నుంచే తమిళనాడు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. 1968లో ద్విభాషా విధానం అమలులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అప్పటికీ జన్మించలేదు కూడా. తమిళనాడు భాషా విధానంపై ఆయనకు అవగాహన ఉండకపోవచ్చని ఎలంగోవన్ వ్యాఖ్యానించారు.
పవన్ వ్యాఖ్యలపై రియాక్షన్
పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళనాడు రాజకీయ నాయకులపై విమర్శిస్తూ, తమిళ సినిమాలు వాణిజ్య ప్రయోజనాల కోసం హిందీలోకి డబ్ చేయించుకోవడం అర్థం అయితే, అదే హిందీని వ్యతిరేకించడమంటే ఏంటని ప్రశ్నించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో డీఎంకే, ఇతర తమిళ రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి:
Viral News: తాగలేదు, ఎయిర్‌బ్యాగ్స్ వల్లే ప్రమాదమన్న యువకుడు..నిజమేనా..
ISIS Global Chief: ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ హతం..ట్రంప్ పనేనా..
Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం..41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Pawan Kalyan: తమిళనాడు సీఎంకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలు..
Read More Business News and Latest Telugu News