Bandi Sanjay: రాజాసింగ్ ఎపిసోడ్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:59 PM
Bandi Sanjay: బీజేపీకి ఎవరితోనూ రహస్య ఎజెండాలు, సమావేశాలు ఉండవని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. డిలీమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం జరగలేదని బండి సంజయ్ అన్నారు.

కరీంనగర్: బీజేపీ నేత రాజాసింగ్ కామెంట్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య రహస్య సమావేశాలు జరిగి ఉండవచ్చని చెప్పారు. రాజాసింగ్ చేసిన కామెంట్లను తాను చూడలేదని బండి సంజయ్ అన్నారు. ఇవాళ(శనివారం) కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.
బీజేపీకి ఎవరితోనూ రహస్య ఎజెండాలు, సమావేశాలు ఉండవని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీ లు.. బీజేపీని అడిగే ఇచ్చారా అని ప్రశ్నించారు. పంటలు ఎండుతుంటే కాంగ్రెస్‌కు పట్టదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ను జాకీ పెట్టి లేపినా ఇక లేవదని విమర్శించారు. డిలీమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం జరగలేదని అన్నారు. ఒక వర్గం, ప్రాంతం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని తేల్చిచెప్పారు. కేంద్రం ప్రకటన చేయకముందే ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Raghunandan Rao: మా సిఫారసు లేఖలు తీసుకోవాలి
High Court: నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
Hyderabad: మోసాలకు కలరింగ్.. నకిలీ యాప్‌లు, స్కీములకు సెలబ్రిటీల ప్రచారం
Read Latest Telangana News and Telugu News