Share News

వంట విషయంలో గొడవ.. పక్కా ప్లాన్‌తో లేపేశాడు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 06:53 PM

స్ప్రహ లేకుండా పడిపోయిన నేత్రమ్‌పై దుప్పటి కప్పి సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుధీర్ ఇంటి బయటకు వచ్చి, తాళం వేసుకుని వెళ్లిపోయిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.

వంట విషయంలో గొడవ.. పక్కా ప్లాన్‌తో లేపేశాడు..
UP Roommates News

క్రైమ్స్ విషయంలో ఉత్తర ప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. దేశంలో ఎక్కడా జరగనన్ని కొత్త, వింత నేరాలన్నీ ఉత్తర ప్రదేశ్‌లోనే జరుగుతూ ఉంటాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ఓ హత్య వెలుగులోకి వస్తూ ఉంటుంది. తాజాగా, రూమ్‌మేట్స్ మధ్య జరిగిన ఓ చిన్న వివాదం హత్యకు దారి తీసింది. బయటినుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అన్నందుకు ఫ్రెండును చంపేశాడు ఓ వ్యక్తి. అది కూడా చాలా పక్కాగా ప్లాన్ చేసి మరీ అతడ్ని చంపేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సుధీర్ శర్మ, నేత్రమ్ శర్మలు అక్కడి మధు విహార్‌లో రూము అద్దెకు తీసుకుని ఉంటున్నారు.


ఇద్దరూ చాలా ఏళ్లనుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. మార్చి 15వ తేదీన ఇద్దరూ రూములో ఉన్నారు. వంట విషయంలో ఇద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. బయటినుంచి ఫుడ్ ఆర్డర్ పెడదామని నేత్రమ్ శర్మ అన్నాడు. ఇందుకు సుధీర్ ఒప్పుకోలేదు. రూములోనే వంట చేసుకుందాం అన్నాడు. వంట విషయంలో చిరు జల్లులా మొదలైన గొడవ కొద్దిసేపటి తర్వాత తుఫానులా మారింది. ఇద్దరూ బాగా గొడవపడ్డారు. నేత్రమ్ సుధీర్‌ను బూతులు తిట్టాడు. దీన్ని అతడు భరించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే నేత్రమ్‌పై సుధీర్ పగ పెంచుకున్నాడు. నేత్రమ్‌ను ఎలాగైనా చంపాలని భావించాడు. ఇందుకోసం ఓ పక్కాప్లాన్ వేసుకున్నాడు. ఇద్దరికీ మందు తాగే అలవాటు ఉంది.


రెండు రకాల మందులను కలపటం వల్ల అది ప్రాణాంతకం అవుతుందని సుధీర్‌కు తెలుసు. మార్చి 16వ తేదీన రాత్రి తన ప్లాన్ అమలు చేశాడు. ఫారెన్ మందు, నాటు సారా రెండు కలిపాడు. దాన్ని నేత్రమ్‌కు ఇచ్చాడు. అది తాగి అతడు ఆపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. స్ప్రహ లేకుండా పడిపోయిన నేత్రమ్‌పై దుప్పటి కప్పి సుధీర్ అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నేత్రమ్ చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతడి శవం కుళ్లిపోయి వాసనం వస్తూ ఉంది. ఆ ఇంట్లోంచి వాసన రావటం గమనించిన పక్కింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ కుళ్లిపోయిన స్థితిలో నేత్రమ్ శవం కనిపించింది.


పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సుధీర్ ఇంటి బయటకు వచ్చి, తాళం వేసుకుని వెళ్లిపోయిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. పోలీసులు సుధీర్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. మార్చి 29వ తేదీన ఖోదా ఏరియాలోని అహిల్యాభాయ్ దగ్గర సుధీర్ పట్టుబడ్డాడు. అతడ్ని అరెస్ట్ చేసి, మీడియా ముందుకు తీసుకువచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలను మీడియకు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

చాణక్య నీతి.. వీళ్ల జోలికి అస్సలు పోకూడదు.. నాశనం అయిపోతారు..

Gold Rate: నిజంగా పండగలాంటి వార్తే.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర

Updated Date - Mar 30 , 2025 | 06:57 PM