Minister Anbarasan: పందుల్లా కంటున్నారు..
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:29 AM
ఓ సభలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అన్బరసన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను తగ్గిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు పందుల్లా పిల్లల్ని కని జనాభాను పెంచేశారంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి.

ఉత్తరాది ప్రజలపై డీఎంకే మంత్రి అన్బరసన్ దూషణ
వీడియో ప్రదర్శించిన అన్నామలై.. నిరసన
చెన్నై, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): డీఎంకే ఆధ్వర్యంలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై శనివారం సామాజిక మాధ్యమాల్లో వెలువరించిన ఓ వీడియో కలకలం రేపింది. ఓ సభలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అన్బరసన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను తగ్గిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు పందుల్లా పిల్లల్ని కని జనాభాను పెంచేశారంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇంకా ఆ మంత్రి మాట్లాడుతూ.. హిందీ నేర్చుకున్న ఉత్తరాది యువకులంతా తన ఇంట పశువులు మేపుకుంటున్నారని, పానీ పూరీలు అమ్ముకుంటున్నారని, తమిళులు హిందీని నేర్చుకుని ఉంటే వారిలాగే ఉత్తర భారతదేశానికి వెళ్లి పానీ పూరీలు అమ్ముకునే దుర్గతి పట్టేదని వ్యాఖ్యానించారు. దీనిపై అన్నామలై స్పందిస్తూ.. మంత్రి హోదాలోని వ్యక్తి ఉత్తరాదివారిని కించపరిచేలా మాట్లాడడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, జేఏసీ భేటీకి వ్యతిరేకంగా తమిళనాడు అంతటా బీజేపీ నేతలు నిరసనలు తెలిపారు.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు నల్ల దుస్తులు ధరించి పలు చోట్ల నిరసనలు చేపట్టారు. పాలనాపరమైన అవినీతి కారణంగా ప్రజల నుంచి చవిచూస్తున్న వ్యతిరేకతను కప్పిపెట్టుకోవడం కోసం కొందరు సీఎంలు జేఏసీ భేటీకి వచ్చారని తమిళిసై విమర్శించారు. కాగా, పునర్విభజనను వ్యతిరేకిస్తున్నవారు... నిజంగానే సమస్య ఉందని భావిస్తున్నారా లేక రాజకీయ ఏజెండాతో వెళుతున్నారా అని ఆర్‌ఎ్‌సఎస్ ప్రశ్నించింది. పునర్విభజన ప్రక్రియను కేంద్రం ఇంకా అసలు మొదలే పెట్టలేదని, అలాంటప్పుడు చర్చలేమిటని ఆర్‌ఎ్‌సఎస్ జాతీయ సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News

దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

వాహనదారులకు నిజంగా ఇది పిడుగులాంటి వార్త.. అదేంటో తెలిస్తే..

నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్నే మార్చాలంటారా?

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్
