Arvind Kejriwal-Anna Hazare: కేజ్రీవాల్‌ను వదలని అన్నా హజారే శాపం.. ఆ మాట విని ఉంటే..
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:30 PM
Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే జరిగింది. ఫలితాల్లో బీజేపీ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఊహించని విధంగా ఆ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఫలితాల్లో బీజేపీ దూకుడు ముందు ఆప్ నిలబడలేకపోయింది. స్వయంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా పరాజయం మూటగట్టుకున్నారు. దీంతో అంతా షాక్ అవుతున్నారు. తనను ఓడించే వాళ్లే లేరంటూ బీరాలు పోయిన కేజ్రీవాల్ ఓటమిని ఆప్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు ఈ పరిస్థితి రావడానికి ఓ శాపమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
స్నేహానికి బ్రేక్!
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే శాపం తగలడంతోనే కేజ్రీవాల్ దారుణ ఓటమి పాలయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ భారీ ఓటమికి కూడా అదే రీజన్ అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఒకప్పుడు అన్నా హజారే-కేజ్రీవాల్ కలసి పనిచేశారు. అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భుజం భుజం కలిపి ముందుకు సాగారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాలని కేజ్రీవాల్ డిసైడ్ అవడంతో వీళ్ల స్నేహానికి బ్రేక్ పడింది.
చెప్పినా వినలేదు!
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే కేజ్రీవాల్ నిర్ణయాన్ని అన్నా హజారే అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమ ఆశయాలను ఇది పక్కదారి పట్టిస్తుందని వారించారు. పొలిటికల్‌గా ఎదగాలనే కేజ్రీవాల్ కోరికను ఆయన తప్పుబట్టారు. ఉద్యమానికి ఇది పూర్తి వ్యతిరేకమని ఖండించారు. కానీ కేజ్రీవాల్ మాట వినలేదు. పార్టీ స్థాపించి గెలిచారు. ఢిల్లీ గద్దెనెక్కి సీఎంగా పాలన సాగించారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ తిరిగి అదే అవినీతిలో మునిగిపోయారు.. ఆయన ప్రభుత్వం అవినీతిమయంగా మారిందనే విమర్శలకు గురైంది.
సూత్రాలు మరిచారు!
లిక్కర్ కేసు కూడా ఆప్ సర్కారును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ కేసులో గతేడాది మార్చి 21న అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్. ఆయనతో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్లి కొన్ని నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఒకప్పుడు అన్నా హజారే అండతో ఎదిగిన కేజ్రీవాల్.. ఆయన మాట కాదని బయటకు వచ్చారు. ఉద్యమంతో వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకొని రాజకీయ పార్టీ స్థాపించి ఈ స్థాయికి చేరుకున్నారు. కానీ హజారే చెప్పిన సూత్రాలు.. నేతల ఆలోచన, ప్రవర్థన స్వచ్ఛంగా ఉండాలి, జీవితం మొత్తం నిందలు లేకుండా బతకాలి, త్యాగాలు చేయాలి, అవినీతి-అక్రమాలకు దూరంగా ఉండాలి లాంటివి మాత్రం పాటించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ శాపమే కేజ్రీవాల్ పతనానికి కారణమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవీ చదవండి:
'ఆమ్ ఆద్మీని గెలిపించే బాధ్యత కాంగ్రెస్‌పై లేదు'
ఇదీ మోదీ దెబ్బ.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి
ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆప్ కీలక నేతలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి