Share News

Bangladesh political crisis: బంగ్లాదేశ్‌లో ఆర్మీ తిరుగుబాటు?

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:34 AM

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన మంత్రి మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజధాని ఢాకాలో సైన్యం ప్రవేశించిందనే ఊహాగానాలు, అత్యవసర సైనిక సమావేశం తిరుగుబాటు అవకాశాలను చర్చనీయాంశంగా మార్చాయి.

Bangladesh political crisis: బంగ్లాదేశ్‌లో ఆర్మీ తిరుగుబాటు?

ఢాకా, మార్చి 25: బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడినట్టు ప్రచారం జరుగుతోంది. దేశంలో తిరుగుబాటు వాతావరణం నెలకొందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాజధాని ఢాకాలోకి సైన్యం ప్రవేశించినట్టు సమాచారం. అంతేకాదు, ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రధాని యూనస్‌ సర్కారుపై తిరుగుబాటుకు సిద్ధమైనట్టు సమాచారం. దేశంలో ఎమర్జెన్సీ లేదా మార్షల్‌ లా విధించే అవకాశం ఉందని మీడియా పేర్కొనడం గమనార్హం. ‘ఇండియా టుడే’ కథనం మేరకు.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ యూ జమాన్‌ నేతృత్వంలో సోమవారం ఉన్నతస్థాయి సైనికాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ స్పందిస్తూ.. ప్రజల్లో అశాంతి, అపనమ్మకం పెరిగిపోయిందని ఇలాంటి సమయంలో ఆర్మీ పాత్ర కీలకం కానుందని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:35 AM