Encounter: కథువాలో భారీ ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:42 AM
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా జుథాని ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇద్దరు పోలీసుల మృతి
ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ, మార్చి 27: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా జుథాని ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు కాగా, నలుగురు పోలీసులు. వారు ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న భద్రత బలగాలు గత నాలుగు రోజులుగా గాలింపు చర్య లు చేపడుతుండగా రాజ్‌భాగ్ పరిధిలోని ఘాటి జథునా ప్రాంతం జాఖోల్ గ్రామం వద్ద ఎదురు కాల్పులు జరిగాయి. పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదులకు ఇటీవల కాలం కథువా కేంద్రంగా మారడంతో భద్రతాబలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.