Share News

భార్యను చంపి.. అత్తామామలకు ఫోన్..

ABN , Publish Date - Mar 27 , 2025 | 09:51 PM

బెంగళూరు నగరంలో పది రోజుల్లో రెండు దారుణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఘటనలో బిజినెస్ మ్యాన్.. తన భార్య, అత్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మరో ఘటనలో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు.

భార్యను చంపి.. అత్తామామలకు ఫోన్..
Bengaluru News

మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో భర్త .. భార్యను చంపేశాడు. ఆమెను ముక్కలుగా కోసి సూటుకేసులో కుక్కాడు. అనంతరం అత్తామామలకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఈ దారుణం బెంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన రాకేష్, గౌరీ అనిల్ సంబేకర్ భార్యాభర్తలు. వీరిద్దరూ బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లు చేస్తున్నారు. దొడ్డకన్నహళ్లిలోని ఓ ఇంట్లో గత సంవత్సరం నుంచి అద్దెకు ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ, రాకేష్ తన భార్యను చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు.


ఆ ముక్కల్ని సూట్ కేసులో నింపాడు. అనంతరం మహారాష్ట్రలో ఉంటున్న గౌరీ అమ్మానాన్నలకు ఫోన్ చేశాడు. ‘ హలో.. మీ కూతుర్ని’ చంపేశాను. అంటూ వారికి ఏం జరిగిందో వివరించి చెప్పాడు. గౌరీని ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టిన సంగతి కూడా చెప్పాడు. గౌరీ తల్లి దండ్రులు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు హులిమావు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న హులిమావు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ సూట్ కేసులో గౌరీ శరీర భాగాలు వెలుగు చూశాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాకేష్ కోసం అన్వేషిస్తున్నారు. రాకేష్ పోలీసులకు దొరికితే భార్యను ఎందుకు చంపాడో తెలుస్తుంది.


భార్య, అత్త కలిసి..

మరో ఘటనలో ఓ బిజినెస్ మ్యాన్.. భార్య, అత్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. బెంగళూరుకు చెందిన సింగ్ అనే వ్యక్తి పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అక్రమ వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. సింగ్ చేసే తప్పుడు పనులు చూసి అతడి భార్య, అత్త తట్టుకోలేకపోయారు. ఇద్దరూ కలిసి అతడ్ని చంపాలని నిశ్చయించుకున్నారు. గత శనివారం రాత్రి అతడు తినే తిండిలో నిద్రమాత్రలు కలిపారు. అతడు మత్తులోకి జారుకున్న తర్వాత కారులో చిక్కబనవారలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతడి గొంతు కోసి చంపేశారు. శవాన్ని కారులోనే వదిలేసి ఇంటికి వచ్చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.


ఇవి కూడా చదవండి:

ఫ్యాన్స్ మధ్య గొడవ

Guinness World Records: గిన్నిస్ రికార్డులో మేక.. ప్రత్యేక ఏంటో తెలుసా?

Kunal Kamra: నిన్న షిండే.. నేడు నిర్మలా సీతారామన్.. మరో వివాదంలో కునాల్ కమ్రా

Updated Date - Mar 27 , 2025 | 09:53 PM