Share News

Maha Kumbh 2025 : పవిత్ర కుంభమేళాలో ఇవేం పనులు.. ఛీ ఛీ వీళ్లకు బుద్ధి రాదా..

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:57 PM

‌ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయా‌గ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. హిందూ మతంలోని గొప్పతనం ఇదే అని అంతా ప్రశంసిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపే. పవిత్ర స్నానాల కోసం ఇంత దూరం వచ్చి కొందరు త్రివేణి సంగమం ఒడ్డున చేస్తున్న పనులు చూస్తే ఎవరైనా ఛీ ఛీ అనక మానరు. అమృత స్నానాలు చేసే చోట కొందరు భక్తులు చేస్తున్న అసహ్యకరమైన పనులు ఇవి..

Maha Kumbh 2025 : పవిత్ర కుంభమేళాలో ఇవేం పనులు.. ఛీ ఛీ వీళ్లకు బుద్ధి రాదా..
People Doing Dirty Thing at Maha Kumbha Mela

144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళా ఇది. అందుకే ప్రయా‌గ్‌రాజ్‌లో ఈ సారి జరుగుతున్న కుంభమేళాకు అందరూ అంత విశిష్టమైనదిగా భావిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారైనా త్రివేణి సంగమ జలాల్లో పవిత్ర స్నానం ఆచరించాలని దేశవిదేశాల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, సాధువులు తరలి వస్తున్నారు. జనాల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ‌ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వమూ భక్తులు బస చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కిలోమీటర్ల పొడవునా టెంట్లు, తాగు నీటి సౌకర్యం, పోర్టబుల్ టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేసింది. రోజూ లక్షల మంది జనాభా వస్తున్నా శానిటైజేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటోంది. ఇన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినా కొందరు భక్తులు సంగం నది ఒడ్డున చేయరాని పనులు చేస్తూ కుంభమేళా పవిత్రతను దెబ్బతీస్తున్నారు.


మహా కుంభమేళాలో అమృత స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో భక్తులు ప్రయా‌గ్‌రాజ్‌కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేలా కొందరు భక్తులు సంగం నది ఒడ్డున చేయరాని పనులను చేస్తున్నారు. ఇది కుంభమేళా పవిత్రతకు, విశిష్టతకు భంగం కలిగించేలా వీరు చేస్తున్న అసహ్యకరమైన పనులు చూసి అంతా నివ్వెరపోతున్నారు.


పవిత్ర స్నానాలు చేసే చోట కూడా ఇదే పనా..

కుంభమేళా సమయంలో గంగా నదీ జలాలు అమృతంతో సమానంగా మారతాయని అంటారు. ఇది ఇంకోలా అర్థం చేసుకున్నాడు ఓ మందుబాబు. చేతిలో బ్రాందీ సీసా, గ్లాసుతో నేరుగా సంగం నది ఒడ్డుకు వెళ్లిపోయాడు. అందరూ చూస్తుండగానే గంగా నదిలోని నీటిని గ్లాసుతో ముంచుకుని బ్రాందీ కలుపుకుని తాగాడు. ఇది చూసిన వారు పవిత్ర స్నానాలు చేసే చోట ఇవేం పనులు.. వీళ్లకు బుద్ధి రాదా అని తిట్టి పోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


స్నానానికి వెళ్లి.. భయంతో పరుగులు పెట్టిన యువతి..

పవిత్ర స్నానం ఎంతో దూరం నుంచి కుంభమేళాకు వచ్చిన ఓ యువతికి అనుకోని పరిస్థితి ఎదురైంది. నది ఒడ్డున మూత్రం పోయడం, కుప్పలు తెప్పలుగా పడి ఉన్న ప్లాస్టిక్, పూలదండలు పడి ఉన్న చోటు చూసి బిత్తరపోయింది. మురికికూపం కంటే ఘోరంగా ఇక్కడ పరిస్థితి ఉందంటూ వీడియో తీసి బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన వారంతా కామన్‌సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తుంటే నిర్వాహకులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కొందరు భక్తుల చేష్టల వల్ల పవిత్ర స్నానానికి అర్థమే లేకుండా పోతోందని ఆవేదన నిండిన కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 04:58 PM