Share News

BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..

ABN , Publish Date - Jan 04 , 2025 | 02:02 PM

కాంట్రాక్టర్‌ సచిన్‌ పంచాళ ఆత్మహత్య వెనుక మంత్రి ప్రియాంక ఖర్గే(Minister Priyanka Kharge) పాత్ర ఉందనే అనుమానం ఉందని నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డేరి వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు.

BJP: ఖర్గే రాజీనామా చేసే వరకు పోరాటం..

బెంగళూరు: కాంట్రాక్టర్‌ సచిన్‌ పంచాళ ఆత్మహత్య వెనుక మంత్రి ప్రియాంక ఖర్గే(Minister Priyanka Kharge) పాత్ర ఉందనే అనుమానం ఉందని నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డేరి వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్‌ డెత్‌నోట్‌లో మంత్రి ప్రియాంక ఖర్గే పీఏ రాజు కపనూర పేరు స్పష్టంగా పేర్కొన్నారని అయినా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ వార్తను కూడా చదవండి: Tomato: కడుపుకోత.. పశువులకు మేత


మంత్రి పోలీసుశాఖపై ఒత్తిడి తెచ్చి తన పీఏకు రక్షణగా నిలిచారన్నారు. తద్వారా కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు మంత్రి ప్రియాంక ఖర్గే, కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరుగా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రేపు మంత్రి ఖర్గే గుల్బర్గాలోని ఇంటిని ముట్టడించి నిరసన చేపట్టేందుకు పార్టీ సిద్ధమైందన్నారు. ఈ అంశంపై నిరసనకు వచ్చేవారికి కాఫీ, బిస్కట్‌ ఇస్తామంటూ మంత్రి ఖర్గే నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రాజీనామా చేసేంతవరకు బీజేపీ పోరాటం ఆగదన్నారు.


pandu3.jpg

బెంగళూరు గ్రామీణ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటే అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు. వాల్మీకి కార్పొరేషన్‌లో అవినీతి, ముడా ఇళ్లస్థలాల్లో అక్రమాలు, వక్ఫ్‌బోర్డు వ్యవహారం, బాలింతల మృతి ఇలా వరుసగా వైఫల్యాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అవినీతి ప్రభుత్వం తొలగేంతవరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. మీడియా సమావేశంలో నగరసభ సభ్యుడు బంతి వెంకటేశ్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2025 | 02:02 PM