Kerala: వృద్ధుల సంక్షేమ కమిషన్!
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:20 AM
ఈ కమిషన్ వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసంపై దృష్టి సారించడంతోపాటు సమాజ హితానికి వారి నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. తద్వారా వృద్ధుల సంక్షేమానికి కమిషన్ ఏర్పాటు చేయనున్న తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.

బిల్లు ఆమోదించిన కేరళ అసెంబ్లీ
తిరువనంతపురం, మార్చి 21 : వృద్ధుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ కమిషన్ వృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసంపై దృష్టి సారించడంతోపాటు సమాజ హితానికి వారి నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. తద్వారా వృద్ధుల సంక్షేమానికి కమిషన్ ఏర్పాటు చేయనున్న తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. సీనియర్ సిటిజన్ల భద్రతకు తమ ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా హామీ ఇస్తుందని విజయన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే