Tirumala: తెలంగాణ నేతలు సిఫార్సు లేఖలు.. టీటీడీ ఉక్కిరి బిక్కిరి
ABN , Publish Date - Mar 23 , 2025 | 07:47 PM
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనానికి సోమవారం నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజే రికార్డు స్థాయిలో సిఫార్సు లేఖలు టీటీడీకి పోటెత్తాయి.

తిరుమల, మార్చి 23: తిరుమలలో కొలువు తీరిన శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలి రోజే తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు వెల్లువెత్తాయి. ఆదివారం ఒక్క రోజే.. 90 మంది ప్రజా ప్రతినిధులు ఈ సిఫార్సు లేఖలను జారీ చేశారు. తెలంగాణ నుంచి 180 మంది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివరాలను నమోదు చేసింది.
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖను టీటీడీ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వానికి పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తరచూ విజ్జప్తి చేస్తున్నారు.
వీరి విజ్జప్తిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకుని టీటీడీ దర్శనం కల్పించనుంది. అంటే.. సోమవారం నుంచి ఈ పద్దతి అమల్లోకి రానుంది.
అందులోభాగంగా ఆదివారం అంటే.. మార్చి 23వ తేదీన తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు ద్వారా మార్చి 24వ తేదీన స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకునే వారు.. ఆ ముందు రోజే.. ఆ సిఫార్సు లేఖలను టీటీడీకి పంపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను వారంలో రెండు రోజులు మాత్రమే టీటీడీ అనుమతించనుంది.
ఆదివారం, సోమవారం సిఫార్సు లేఖలను తీసుకుని.. సోమ, మంగళవారాలు స్వామి వారి దర్శనం కల్పించనుంది. రూ.300 ప్రత్యేక దర్శనం విషయంలోనూ ఇదే రూలు వర్తిస్తుంది.తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో బుధ, గురువారాల్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనుంది. అది కూడా ఒక ప్రజా ప్రతినిధి ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతించనుంది. ఒక లేఖపై ఆరుగురికి మించకుండా శ్రీవారి దర్శనం కల్పించనుంది.
కాగా,మార్చి 30వ తేదీన తిరుమలలో తెలుగు ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మార్చి 25వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి..
Ex MP Kesineni Nani : డీలిమిటేషన్‌పై స్పందించిన మాజీ ఎంపీ
CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు
Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు
Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..
KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి
IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు
For Andhrapradesh News And Telugu News