
CSK vs MI IPL 2025: చెన్నై చేజింగ్ షురూ.. గట్టిగానే మొదలెట్టారు
ABN , First Publish Date - Mar 23 , 2025 | 07:35 PM
IPL 2025 Live Updates in Telugu: ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు మీకు అందిస్తోంది. అసలే ఆదివారం ఇవాళ డబుల్ ధమాకా.. ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ మధ్య రసవత్తర మ్యాచ్ ముగిసింది. ఇక అసలైన మ్యాచ్ జరుగుతోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓవర్ టు ఓవర్ అప్‌డేట్స్ మీకోసం..

Live News & Update
-
2025-03-23T21:55:42+05:30
ఎంఐ, సీఎస్‌కే మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తోన్న క్రికెట్ ప్రేమికులు..
-
2025-03-23T21:55:41+05:30
చెన్నై ఫస్ట్ వికెట్ ఔట్..
చెన్నై టీమ్ ఫస్ట్ వికెట్ కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి ఔట్ అయ్యాడు. 3 బంతులాడిన రాహుల్ రెండు పరుగులు చేశాడు. ప్రస్తుతం చెన్నై స్కోర్ 11/1.
-
2025-03-23T21:25:12+05:30
చెన్నై టార్గెట్ ఎంతంటే..
ముంబై ఇండియన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. చెన్నై 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
-
2025-03-23T21:00:33+05:30
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేలవంగా ఆడుతోంది.
120 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సూర్య సేన.
నూర్ అహ్మద్ 4 వికెట్లతో ఎంఐ నడ్డి విరిచాడు.
150 లోపే చాప చుట్టేసేలా ఉంది ముంబై.
-
2025-03-23T19:47:36+05:30
మరో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్..
రికెల్టన్ రెండో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.
7 బంతులాడిన రికెల్టన్ 3 ఫోర్లతో 13 పరుగులు చేశాడు.
-
2025-03-23T19:36:41+05:30
రోహిత్ శర్మ డకౌట్..
-
2025-03-23T19:35:44+05:30
టాస్ గెలిచిన చెన్నై.. బౌలింగ్ ఎంపిక..