Jio: జియో బంపర్ ఆఫర్.. రీఛార్జ్ ప్లాన్‌లతోపాటు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్..
ABN , Publish Date - Mar 23 , 2025 | 07:53 PM
జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌ను ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

రిలయన్స్ జియో భారతదేశంలో టెలికాం రంగంలో కీలక సంస్థగా ఉంది. ఈ క్రమంలో 460 మిలియన్లకు పైగా వినియోగదారుల నెట్‌వర్క్‌తో, జియో ఇప్పటికీ దేశంలో అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. ఈ క్రమంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో తరచూ తన సేవలను, రీఛార్జ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, జియో తన వినియోగదారుల కోసం ఒక కొత్త, క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు ఉచిత AI క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది. ఈ నూతన ఆఫర్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే ప్రత్యేకంగా తక్కువ స్థాయి స్టోరేజ్ ఉన్న ఫోన్స్ ఉన్న వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగపడనుందని అంటున్నారు.
అద్భుతమైన ఆఫర్
జియో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ AI క్లౌడ్ స్టోరేజ్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంది. 2024లో జియో నిర్వహించిన AGM సందర్భంగా ఈ ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించారు. జియో కొత్తగా అందిస్తున్న ఈ సేవ "AI Everywhere for Everyone" అనే పేరుతో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వినియోగదారులు 100GB వరకు స్టోరేజ్‌ను పొందే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దీనిని 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌గా అందిస్తున్నారు.
డేటాను సురక్షితంగా
ఈ సేవ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండు ఖాతాలు కలిగి ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంది. రీఛార్జ్ ప్లాన్‌లలో ఈ AI క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా పొందగలిగే అవకాశం అందిస్తున్నారు. ఈ స్టోరేజ్ సేవ జియో వినియోగదారుల డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వినియోగదారుల పరికరాల్లో ఉన్న నిల్వ పరిమితిని అధిగమించేందుకు సహాయపడుతుంది.
రీఛార్జ్ ప్లాన్‌లతో ఉచిత AI క్లౌడ్ స్టోరేజ్
ఇప్పుడు, జియో తన అనేక రీఛార్జ్ ప్లాన్‌లలో ఉచితంగా AI క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తోంది. వినియోగదారులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. వారి ఆడియో, డాక్యుమెంట్‌లు, అప్లికేషన్ డేటా మొదలైన వాటిని ఈ క్లౌడ్ స్టోరేజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుతం, 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌ను అందించే ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు, 98 రోజుల, 90 రోజుల చెల్లుబాటుతో అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తున్నాయి.
రూ. 999 రీఛార్జ్ ప్లాన్ – 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు 98 రోజుల చెల్లుబాటు
రూ. 899 రీఛార్జ్ ప్లాన్ – 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌తో 90 రోజుల చెల్లుబాటు
ఈ ప్లాన్‌ల ద్వారా వినియోగదారులు అంతర్జాల సేవలను అద్భుతంగా ఆస్వాదించవచ్చు. అలాగే భారీ స్మార్ట్‌ఫోన్ ఫైల్‌లను కూడా స్టోర్ చేసుకోవచ్చు.
జియో ప్లాన్‌లలో ప్రత్యేక ఆఫర్‌లు
రూ. 1299 రీఛార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
రూ. 1029 అమెజాన్ ప్రైమ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 50GB AI క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News