Share News

Delhi Exit Polls Survey : డిఫరెంట్‌గా కేకే సర్వే.. జాతీయ సంస్థల అంచనాలు తలకిందులవుతాయా?

ABN , Publish Date - Feb 05 , 2025 | 08:27 PM

KK Survey: గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయ డంకా మోగిస్తుందని కేకే సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే చెప్పినట్లే.. ఏపీలో కూటమి పార్టీ ఘన విజయం సాధించింది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొంటుందని క్లియర్ కట్‌గా తన సర్వే ద్వారా చెబుతోంది.

Delhi Exit Polls Survey : డిఫరెంట్‌గా కేకే సర్వే.. జాతీయ సంస్థల అంచనాలు తలకిందులవుతాయా?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్టం కట్టినట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తుంటే.. ఒక్క కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) మళ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకొంటుందంటూ ప్రకటించింది. అంతేకాదు.. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. ఆ యా జిల్లాల్లో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో కూడా కేకే సర్వే వివరించింది.

  • సెంట్రల్‌ జిల్లాలో మొత్తం7 అసెంబ్లీ స్థానాలు: ఆప్ (6).. బీజేపీ (1) గెలుస్తోంది.

  • పశ్చిమ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు: ఆప్ (4), బీజేపీ (3), ఇక మిగిలిన ఓ అసెంబ్లీ స్థానంలో ఈ రెండు పార్టీ మధ్య హోరా హోరీగా ఫైట్ జరగనుంది.

  • న్యూఢిల్లీలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు: ఆప్ (4), బీజేపీ (1). మిగిలిన రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండనుంది. దీంతో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి ఈ రెండు సీట్లు గెలువవచ్చు.

  • నార్త్‌ జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు: ఆప్ (4), బీజేపీ (2). మిగిలిన రెండు స్థానాల్లో ఈ రెండు పార్టీ మధ్య టఫ్ ఫైయిట్ జరగనుంది.

  • నార్త్ వెస్ట్ జిల్లాలో 8 స్థానాలు: ఆప్ (3) బీజేపీ (5) స్థానాలు గెలుచుకోనుంది.

  • నార్త్ ఇస్ట్ జిల్లాల్లో 8 స్థానాలు: ఆప్ (5) బీజేపీ (3) స్థానాలు గెలుచుకోనుంది.

  • ఢిల్లీ సౌత్‌ జిల్లాలో 8 స్థానాలు: ఆప్ (5), బీజేపీ (2) స్థానాలు. మిగిలిన స్థానంలో ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి గెలిచే అవకాశముంది.

  • సౌత్ వెస్ట్ జిల్లాలో 8 స్థానాలు: ఆప్ (3), బీజేపీ (3) మిగిలిన రెండు స్థానాల్లో ఏదో ఒక పార్టీ విజయం సాధించనుంది.

  • వెస్ట్ జిల్లాలో 8 స్థానాలు: ఆప్ (5), బీజేపీ (2). ఇక మిగిలిన ఒక అసెంబ్లీ స్థానంలో ఈ రెండు పార్టీ మధ్య హోరా హోరీగా ఫైట్ జరగనుంది.


మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 39 ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడనున్నాయని కేకే సర్వే స్పష్టం చేస్తుంది. ఇక బీజేపీ మాత్రం 22 స్థానాలనే గెలుచుకోనుందని వెల్లడించింది. బీజేపీ మాత్రం 8 నుంచి 22 సీట్లు మధ్య గెలుచుకొంటుందని తెలిపింది. అయితే మొత్తం 9 స్థానాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య పోరు రసవత్తరంగా జరగనుందని తెలిపింది. దీంతో ఈ రెండు పార్టీలో ఏదో ఒకటి.. ఈ స్థానాల్లో విజయ కేతనం ఎగురవేస్తుందని కేకే సర్వే వివరణ ఇచ్చింది. వీటిలో ఆరు మాత్రం ఆప్ గెలుచుకోనే అవకాశం ఉందంది. మూడు స్థానాల్లో మాత్రం బీజేపీ గెలిచే అవకాశముందని సోదాహరణగా వివరించింది.

Also Read: ఎగ్జిట్ పోల్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ ఓటరులు జై కొట్టింది ఎవరికంటే..


మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో ముస్లింలకు 10 స్థానాలుంటే.. వాటిలో రెండింటిలో మాత్రమే బీజేపీ గెలిచే అవకాశముందంది. అలాగే ఎస్సీ స్థానాల్లో సైతం రెండింటిలో బీజేపీకి విజయవకాశాలున్నాయని తెలిపింది. ఇక న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన అరవింద్ కేజ్రీవాల్, జంగ్‌పుర నుంచి పోటీ చేస్తున్న మనీష్ సిసోడియా, కల్కాజీ నుంచి ఎన్నికల్లో నిలబడిన అతిషీలలో.. ఎవరైనా గెలువ వచ్చు.. లేదా ఓటమి పాలయ్యే అవకాశముందని పేర్కొంది. ఎందుకంటే.. ఈ మూడు స్థానాల్లో బీజేపీ చాలా బలంగా ఉందని స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే.. మనీష్ సిసోడియా, అతిషీలు ఓటమి తప్పదని కేకే సర్వే జోస్యం చెప్పింది.

Also Read: ఏపీఎస్ ఆర్టీసీ బోర్డును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


చిట్ట చివరిగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 44 స్థానాలను గెలుచుకొంటుంది. బీజేపీ మాత్రం 26 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేస్తుందని కేకే సర్వే కుండ బద్దలు కొట్టింది. ఫిబ్రవరి 8వ తేదీన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఢిల్లీ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది సుస్పష్టం కానుందన్నదన్నది స్పష్టం.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం

Also Read: డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్.. షూటర్ల కోసం గాలింపు

Also Read : కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

Also Read: మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి: ప్రత్తిపాటి డిమాండ్

For National News And Telugu News

Updated Date - Feb 05 , 2025 | 08:30 PM