భార్యను చంపి, సూట్ కేసులో కుక్కి.. హత్యకు కారణం చెప్పిన రాకేష్
ABN , Publish Date - Apr 02 , 2025 | 09:51 PM
రాకేష్ భార్యను చంపిన తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. ఆ కోసిన శరీర భాగాలను ఓ సూట్ కేసులో కుక్కాడు. సూట్ కేసు బరువుగా ఉందని చెప్పి అక్కడే పడేశాడు. తర్వాత గౌరి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు రంగంలోకి రాకేష్‌ను వెతికి పట్టుకున్నారు. విచారణలో భార్యను ఎందుకు చంపాడో చెప్పాడు.

బెంగళూరుకు చెందిన రాకేష్ అనే వ్యక్తి భార్యను చంపి.. ముక్కలుగా కోసి సూటు కేసులో కుక్కిన సంగతి తెలిసిందే. హత్య తర్వాత అతడు మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారి కూతుర్ని హత్య చేసిన సంగతి చెప్పాడు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాకేష్‌ను కొద్దిరోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 6 రోజుల పాటు అతడ్ని విచారించారు. పోలీసుల విచారణలో అతడు భార్యను ఎందుకు చంపాడో చెప్పాడు. అతడు మాట్లాడుతూ.. ‘ పెళ్లయిన దగ్గరినుంచి ఎప్పుడూ గౌరీతో గొడవలే.. ఆమె నా కుటుంబంలో ఇమడ లేకపోయింది. నా కుటుంబంలోని ఒక్కరితో కూడా తను సరిగ్గా మెలగలేకపోయింది.
బెంగళూరుకు వెళదాం అంటూ ఎప్పుడూ నాతో గొడవపెట్టుకునేది. తన పోరు పడలేక బెంగళూరుకు వచ్చాం. ఇక్కడకు వచ్చిన తర్వాత ఓ నెల రోజుల పాటు గౌరికి ఉద్యోగం దొరకలేదు. నేనే ఆమెకు ఉద్యోగం ఇప్పించాను. అయినా కూడా నేను తనకు జాబ్ ఇప్పించలేదంటూ గొడవపడేది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. నన్ను ఇబ్బంది పెట్టడానికి తరచుగా శబ్ధాలు చేస్తూ ఉండేది. తన పంతం తనదే అనేలా ఉండేది. మార్చి 26వ తేదీన కూడా మా మధ్య గొడవ జరిగింది. ఆ టైంలో తను నన్ను కత్తితో కొట్టింది. దీంతో నేను కత్తితో ఆమె మెడలో పొడిచాను. నన్ను నేను రక్షించుకోవడానికే ఆమెను చంపేశాను.
మర్డర్ నుంచి బయటపడ్డానికి ఆమెను ముక్కలు చేసి, సూటుకేసులో కుక్కాను. దాన్ని అక్కడినుంచి తీసుకెళ్లి ఎక్కడైనా పడేద్దాం అనుకున్నాను. కానీ, బరువుగా ఉండటంతో తీసుకెళ్లటం నాకు కష్టంగా అనిపించింది. అందుకే అక్కడే వదిలేసి వెళ్లిపోయాను’ అని చెప్పాడు. కాగా, మహారాష్ట్రకు చెందిన రాకేష్, గౌరీ అనిల్ సంబేకర్ భార్యాభర్తలు. వీరిద్దరూ బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లు చేస్తున్నారు. దొడ్డకన్నహళ్లిలోని ఓ ఇంట్లో గత సంవత్సరం నుంచి అద్దెకు ఉంటున్నారు. అక్కడే ఈ దారుణం జరిగింది. హత్య విషయం తెలియగానే గౌరీ అమ్మానాన్నలు ఈ దారుణంపై స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేశారు. అక్కడి పోలీసులు.. హులిమావు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోండి..ప్రధానికి స్టాలిన్ లేఖ
IPL 2025, RCB vs GT: తడబడిన బెంగళూరు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే