Share News

Saif Ali Khan Attack case: సైఫ్ అలిఖాన్ కుమారుడి గదిలో దాడి నిందితుడి టోపీ

ABN , Publish Date - Jan 21 , 2025 | 07:50 PM

షెహజాద్ ఏడు నెలల క్రితమే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టాడని, ముంబైకి రావడానికి ముందు అతను పశ్చిమబెంగాల్ ఆథార్ కార్డుతో సిమ్ సంపాదించినట్టు పోలీసులు చెబుతున్నారు.

Saif Ali Khan Attack case: సైఫ్ అలిఖాన్ కుమారుడి గదిలో దాడి నిందితుడి టోపీ

ముంబై: సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan)పై దాడి కేసులో మరో కీలక సాక్ష్యాన్ని ముంబై పోలీసులు కనుగొన్నారు. జనవరి 16 సైఫ్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి తొలుత అతడి కుమారుడు జెహ్ గదిలోకి అడుగుపెట్టాడు. ఆ గదిలో నిందితుడికి చెందిన టీపీని తాజాగా ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాబ్ టోపీలో చిక్కుబడిన జుట్టును ఫోరెన్సిక్ ల్యాబెరేటరీకి పంపామని, దాడి కేసులో స్పష్టతకు ఇది కీలక ఆధారమవుతుందని అధికారులు చెబుతున్నారు.

Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్


దాడి జరిగిన కొద్ది గంటలకే థానేలో నిందితుడు షెహజాద్‌ను ముంబై పోలీసులు పట్టుకున్నారు. అతన్ని కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. దాడి నిందితుడు షెహజాద్‌ బంగ్లాదేశ్ పౌరుడని, అక్రమంగా భారత్‌లోకి అడుగుపెట్టాడని, దీని వెనుక, దాడి వెనుక ఉన్న కారణాలపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ కుట్ర ఏదైనా ఉందా అనే కోణం నుంచి కూడా విచారణ సాగిస్తు్న్నామన్నారు. గత ఐదారు నెలలుగానే ముంబైలో అతను నివాసముంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసుల వాదనతో షెహజాద్ తరఫు లాయరు విభేదిస్తున్నారు. షెహబాద్ గత ఏడేళ్లుగా ముంబైలో తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడని చెప్పారు.


షెహజాద్ ఏడు నెలల క్రితమే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టాడని, ముంబైకి రావడానికి ముందు అతను పశ్చిమబెంగాల్ ఆథార్ కార్డుతో సిమ్ సంపాదించినట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు.


ఇది కూడా చదవండి..

Gautam Adani: 50 లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేయనున్న గౌతమ్ అదానీ

Hero Vijay: ఆ ఎయిర్‏పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 21 , 2025 | 07:50 PM

News Hub