Share News

Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:18 PM

మోడలింగ్ పేరుతో వల వేసి.. యువతులకు అధిక డబ్బు ఆశ చూపి.. వారిని పోర్నోగ్రఫి రాకెట్‌లో భాగం చేసిన సంఘటన వెలుగలోకి వచ్చింది. ఈడీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్
Noida

నోయిడా: ఎక్కువ కష్టపడకుండా బాగా డబ్బులు సంపాదించాలి.. లగ్జరీగా బతకాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకు తగ్గ మార్గాలను ఎన్నుకుని.. ప్రభుత్వాలు, పోలీసుల కన్నుకప్పి దారుణాలకు పాల్పడుతూ డబ్బు సంపాదిస్తున్నారు కొందరు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సదరు దంపతులు మోడలింగ్ పేరుతో యువతులకు వల విసురుతారు. నెలకు లక్షల్లో జీతాలు, లగ్జరీ జీవితం, విదేశీ నిధులంటూ వారిని ప్రలోభాలకు గురి చేస్తారు. ఈ దంపతుల మాటలు నమ్మి.. విష వలయంలోకి అడుగుపెడితే.. ఇక జీవితాలు నాశనమే. మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి.. వచ్చిన వారి చేత పోర్న్ వీడియోలు తీయిస్తూ.. కోట్లు గడిస్తున్నారు ఈ దంపతులు. తాజాగా అధికారులు వీరి నివాసంపై దాడి చేయడంతో ఈ దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన నోయిడాలో చోటు చేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాకు చెందిన ఉజ్వల్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ.. గత ఐదేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా.. తమ నివాసంలోనే పోర్న్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. వీరి కార్యకలాపాలు విదేశాలకు కూడా వ్యాపించాయి. టెక్నిస్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి.. దానిలో అసభ్యకర వీడియోలను ప్రసారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాక మార్కెట్, అడ్వర్టైసింగ్ రీసెర్చ్ పేరుతో తప్పుడు వివరాలను సృష్టించి డబ్బులను విదేశీ కంపెనీలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ అధికారులు ఈ దంపతుల నివాసంలో దాడులు చేసి.. 15.66 కోట్ల రూపాయల మేర అక్రమ విదేశీ నిధులను స్వాధీనం చేసుకున్నారు.

ఉజ్వల్ కిషోర్.. గతంలో రష్యాలో ఈ తరహ రాకెడ్ నడిపేవాడని.. ఇండియా వచ్చాక కూడా తన బుద్ధి మార్చుకోకుండా అలానే తప్పుడు పనులు చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడని అధికారులు తెలిపారు.


ఇలా వల వేస్తారు..

ఉజ్వల్ దంపతులు.. ఫేస్‌బుక్ వేదికగా అందమైన అమ్మాయిలకు ఎర వేస్తారు. మోడలింగ్ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రకటనలు ఇస్తారు. ఇందుకోసం వీరు ప్రత్యేకంగా ఇచాతో డాట్ కామ్ అనే ప్రత్యేక పేజిని కూడా తయారు చేశారు. మోడలింగ్ అవకాలు కల్పిస్తామని.. లక్షల్లో జీతంతో పాటు.. లగ్జరీగా బతికే ఛాన్స్ ఇస్తామని.. ఈ పేజీలో పోస్ట్ చేస్తారు. వీటికి ఆశపడి చాలా మంది యువతులు వీరి చేతిలో బలయ్యారు. బాధితుల్లో ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారే అధికంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

మోడలింగ్ అవకాశం కోసం ఆశపడి.. ఉజ్వల్ దంపతుల ఇంటికి వచ్చిన యువతులను నయానాభయానో ఒప్పించి.. పోర్నోగ్రఫి రాకెట్‌లో పాల్గోనే విధంగా చేస్తారు. తాము చెప్పినట్లు వింటే నెలకు 2 లక్షల రూపాయలు జీతం ఇస్తామని నమ్మిస్తారు. డబ్బులకు ఆశపడి చాలా మంది యువతులు ఈ పోర్నోగ్రఫి రాకెట్‌లో భాగస్వాములయ్యారు.


ఇంట్లోనే భారీ సెటప్..

పోర్నోగ్రఫీ రాకెట్ నిర్వహణ కోసం ఉజ్వల్ దంపతులు ఇంట్లోనే ప్రొఫెషనల్ వెబ్‌కామ్ స్టూడియోను సెట్ చేసుకున్నారు. అసభ్య సమాచారం ప్రచారం కోసం అత్యాధునిక హైటెక్ బ్రాడ్‌కాస్టింగ్ సౌకర్యాలని వినియోగిస్తున్నారు. ఇక ఈడీ దాడులకు వచ్చిన సమయంలో.. ఉజ్వల్ ఇంటి పరిసరాల్లో ముగ్గురు యువతులు ఉండగా.. అధికారులు వారిని అదుపులోకి తీసుని స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

పేమెంట్‌ను బట్టి మోడల్స్ టాస్క్స్ చేస్తారని.. అంటే సగం, పూర్తిగా ముఖాలు కనిపించేలా, పూర్తి నగ్నంగా కనిపించే విధంగా టాస్క్‌లు ఉంటాయని.. అందుకు తగ్గట్టుగా పేమెంట్స్ చేస్తారని అధికారులు తెలిపారు. ఈ సేవలను పొందడం కోసం కస్టమర్లు టోకెన్స్ కొనుగోలు చేస్తారని.. క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారని అధికారులు తెలిపారు. వచ్చిన మొత్తంలో 75 శాతం ఉజ్వల్ దంపతులు తీసుకుని.. 25 శాతం మోడల్స్‌కు చెల్లిస్తారని.. వెల్లడించారు. ఈడీ అధికారులు నెదర్లాండ్ బ్యాంక్ అకౌంట్ నుంచి టెక్నిస్ లిమిటెడ్‌కు 7 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం కోసం నిందితులు అంతర్జాతీయ డెబిట్ కార్డ్స్‌ను వినియోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ రాకెట్‌లో వేల మంది యువతులు భాగస్వాములు అయ్యారని అధికారులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతుందని.. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:

మేకప్ చెదిరినా పర్లేదు దీన్ని మాత్రం వదిలేదే లేదు.. వధువు నిర్వాకానికి అంతా షాక్..

నీట్‌కు భయపడి ప్లస్‌-2 విద్యార్థిని ఆత్మహత్య

Updated Date - Mar 30 , 2025 | 01:25 PM