Share News

CRPF : ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్‌ బాంబు

ABN , Publish Date - Feb 05 , 2025 | 06:17 AM

అమర్చిన ప్రెషర్‌ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్‌...

CRPF : ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్‌ బాంబు

  • ముగ్గురు జవాన్లకు గాయాలు

చింతూరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లు మంగళవారం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబ్‌పై ఇద్దరు జవాన్లు అడుగు వేయడంతో అది పేలింది. ఆ ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరో జవాను మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్‌పై అడుగు వేయడంతో గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్లను రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 06:18 AM