Share News

Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ భేటీ

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:12 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌ సెల్వం భేటీ కానున్నారు. రామనాథపురం జిల్లాలో పాంబన్‌ వంతెన ప్రారంభోత్సవానికి ఆదివారం ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు మాజీ సీఎంలు ప్రధానితో భేటీ కానున్నారు.

Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ భేటీ

- మోదీతో వేర్వేరుగా సమావేశం

చెన్నై: ఒక్కరోజు పర్యటన కోసం ఆదివారం రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)తో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, ఆ పార్టీ బహిష్కృత నేత ఒ.పన్నీర్‌ సెల్వం వేర్వేరుగా భేటీ కానున్నారు. ఈ మేరకు వారిద్దరికీ ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. రామనాథపురం జిల్లాలో పాంబన్‌ వంతెన(Pamban Bridge) ప్రారంభోత్సవం కోసం ఈ నెల 6వ తేదీ ప్రధాని రానున్న విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం


nani2.2.jpg

అక్కడి నుంచి ప్రధాని మదురైకి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో చేరుకుని ఢిల్లీ వెళ్తారు. ఈ నేపథ్యంలో మదురై విమానాశ్రయంలో ప్రధానితో ఈపీఎస్‌, ఓపీఎస్‌(EPS, OPS) వేర్వేరుగా భేటీ కానున్నట్లు సమాచారం. ఇటీవలే బీజేపీ అగ్రనేత అమిత్‌షా(Amit Shah)తో ఎడప్పాడి భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మోదీతో కూడా సమావేశమై న తరువాత అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖరారు కావడం తధ్యమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

చెడగొట్టు వానకు రైతు విలవిల!

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2025 | 01:12 PM