Nuclear Deal Greenlight: భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణానికి అమెరికా గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:07 AM
భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణానికి అమెరికా హోల్టెక్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందం 10 సంవత్సరాల పాటు చెల్లుబాటవుతుంది మరియు ప్రతి ఐదేళ్లకొకసారి పునఃసమీక్షిస్తా

హోల్టెక్ సంస్థకు అనుమతి
న్యూఢిల్లీ, మార్చి 30: భారత్-అమెరికా మధ్య అణు ఒప్పందంలో రెండు దశాబ్దాల తర్వాత కీలక ముందడుగు పడింది. భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణం, రూపకల్పనకు హోల్టెక్ ఇంటర్నేషనల్ సంస్థకు అమెరికా రెగ్యులేటరీ అనుమతిచ్చింది. ఈ ఒప్పందానికి అమెరికా ఇంధన శాఖ (డీవోఈ) మార్చి 26న ఆమోదం తెలిపింది. 2007లో భారత్, అమెరికా మధ్య 123 ఒప్పందాలపై సంతకాలు జరిగిన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఆమోదం లభించడం గమనార్హం. అప్పట్లో కుదిరిన అణు ఒప్పందంలోని వాణిజ్య కోణాన్ని అందిపుచ్చుకునే మార్గంలో దీన్ని తొలి అడుగుగా పరిగణిస్తున్నారు. భారత్‌లోని మూడు సంస్థలైన హోల్టెక్ ఆసియా, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్‌తో కలిసి మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీని పంచుకునేందుకు హోల్టెక్‌కు అనుమతి లభించింది. ‘10సీఎఫ్‌ఆర్810’ అని పిలిచే నిర్బంధ అమెరికా రెగ్యులేషన్ కింద ఈ అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందం పదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ప్రతి ఐదేళ్లకొకసారి దీన్ని పునఃసమీక్షిస్తారు.
ఇవి కూడా చదవండి:
వంట విషయంలో గొడవ.. పక్కా ప్లాన్‌తో లేపేశాడు..
Gold Rate: నిజంగా పండగలాంటి వార్తే.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర