18 నెలల క్రితం హత్య..ఇంట్లో ప్రత్యక్షమైన యువతి
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:36 PM
చనిపోయిన వ్యక్తి తిరిగిరావటం అన్నది అసాధ్యం. అది సినిమాల్లో.. కథల్లో మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటిది నిజ జీవితంలోనూ హత్యకు గురైన ఓ మనిషి తిరిగి వస్తే.. షాకింగ్‌గా ఉంటుంది కదూ..

18 నెలల క్రితం మధ్య ప్రదేశ్‌లోని మంద్సార్ జిల్లాకు చెందిన లలితా బాయి అనే యువతి హత్యకు గురైంది. పోలీసులు లలితా బాయి శవాన్ని తల్లిదండ్రులకు చూపించారు. ఒంటిపై ఉన్న గుర్తులు, కాలికి ఉన్న తాడు, చేతి మీద పచ్చబొట్టు సాయంతో ఆ శవం తమ కూతురిదే అని వాళ్లు గుర్తు పట్టారు. తర్వాత ఆ శవానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. లలిత మరణంపై మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ నలుగురు వ్యక్తులు ఆ మర్డర్ చేసినట్లు తేలింది. ఇమ్రాన్, షారుఖ్, సోను, ఎజాజ్‌లు జైలు పాలయ్యారు. 18 నెలలు తర్వాత ఓ షాకింగ్ విషయం జరిగింది. హత్యకు గురైన లలితా బాయి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెను చూసి కుటుంబసభ్యులు షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యారు.
భయంతో బిక్క చచ్చిపోయారు. చనిపోయిన వ్యక్తి తిరిగిరావటం ఏంటని అనుకున్నారు. వచ్చింది మనిషా?.. లేక దెయ్యమా అన్న అనుమానం కూడా కలిగింది. కొద్ది సేపటి తర్వాత ఆ అనుమానం తీరిపోయింది. ఆమె దెయ్యం కాదు.. మనిషే అని తేలింది. చనిపోయిన కూతురు తిరిగి రావటంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ వెంటనే తండ్రి రామేష్ నానురామ్ లలితను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. తన కూతురు బతికే ఉందని వారికి చెప్పాడు. వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావ్ అని ఆమెను అడిగారు. లలిత మాట్లాడుతూ... ‘ నేను భానుపుర గ్రామానికి చెందిన షారుఖ్‌తో వెళ్లిపోయాను. అతడితో రెండు రోజులు ఉన్నాను. తర్వాత అతడు నన్ను ఐదు లక్షలకు వేరే వ్యక్తికి అమ్మేశాడు.
నేను కోటలో సంవత్సరంన్నర ఉన్నాను. తర్వాత అక్కడినుంచి తప్పించుకున్నాను. ఇప్పుడు ఇంటికి వచ్చాను’ అని తెలిపింది. తానే లలితను అని నిరూపించే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వారికి చూపించింది. లలితకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తల్లి తిరిగిరావటంతో వారు సంతోషంలో మునిగిపోయారు. మరో వైపు లలితను చంపిన కేసులో అరెస్టయిన నలుగురు 18 నెలలుగా జైలులోనే ఉన్నారు. వాళ్లు అసలు ఎవరిని చంపారు? అన్నది అర్థంకాకుండా పోయింది. వారు ఆ హత్య చేశారా? లేదా అన్నది అంతుచిక్కని ప్రశ్న. పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు? అన్నది తెలియరావాల్సి ఉంది. ఆమె ఎవరో తెలిస్తే.. ఆమెను హత్య చేసింది ఎవరో కనుక్కోవటం ఈజీ అవుతుంది.
ఇవి కూడా చదవండి:
RSS: ఆర్ఎస్ఎస్, బీజేపీ విభేదాలపై సంఘ్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
TDP vs YCP: తాడిపత్రిలో ఉద్రిక్తత
Theft viral video: భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..

దేవుళ్లు సరిగానే ఉన్నారు... కొందరు మనుషులే తేడా..

వాహనదారులకు నిజంగా ఇది పిడుగులాంటి వార్త.. అదేంటో తెలిస్తే..

నాలుగు రోజులు ఎండ తీవ్రం.. మధ్యాహ్నం ఇంటివద్దే ఉండండి

ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్నే మార్చాలంటారా?

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్
